Jobs, Salary increments: వాళ్ల ఉద్యోగాలకు ఢోకా లేదట.. జీతాలు కూడా పెరుగుతాయి..
న్యూ ఢిల్లీ : మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు! అంతేకాకుండా.. మీ ఉద్యోగాల్లో పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్‌లు కూడా అంతే పదిలంగా ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బందికి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య పురి ( HDFC Bank MD, CEO Aditya Puri ) హామీ ఇచ్చారు. ``అందుకు మీరు చేయాల్సిందల్లా బ్యాంకు ముందున్న ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీ వంతు పాత్ర పోషిస్తూ సమిష్టి కృషిని అందించడమే`` అని ఆయన సిబ్బందికి సూచించారు.
HDFC bank jobs, salary hikes, bonuses: న్యూ ఢిల్లీ : మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు! అంతేకాకుండా.. మీ ఉద్యోగాల్లో పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్‌లు కూడా అంతే పదిలంగా ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బందికి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య పురి ( HDFC Bank MD, CEO Aditya Puri ) హామీ ఇచ్చారు. ''అందుకు మీరు చేయాల్సిందల్లా బ్యాంకు ముందున్న ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీ వంతు పాత్ర పోషిస్తూ సమిష్టి కృషిని అందించడమే'' అని ఆయన సిబ్బందికి సూచించారు.
ఈ విషయాన్ని కేవలం తాను మాత్రమే చెప్పడం లేదని, తన తర్వాత బాధ్యతలు స్వీకరించనున్న శశిధర్ జగదీశన్‌తో ( Sashidhar Jagdishan ) పాటు యాజమాన్యం తరపున ఇస్తున్న హామీ అని ఆదిత్య పురి అభిప్రాయపడ్డారు. 25 ఏళ్లుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ( HDFC bank ) సేవలు అందిస్తున్న ఆదిత్య పురి ఈ నెల చివర్లో పదవీ విరమణ ( Aditya Puri to retire ) పొందనున్న నేపథ్యంలో గత వారం 1.5 లక్షల మంది బ్యాంక్ సిబ్బందికి పంపించిన వీడియో సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. Also read : SBI offers on loans: కరోనా కాలంలో రుణాలపై ఎస్బీఐ ఆఫర్స్
గత రెండు త్రైమాసికాల నుంచి కరోనా సంక్షోభంతో ( COVID-19 crisis ) మార్కెట్ ఒడిదుడుకులకు లోనైప్పటికీ.... సంస్థ ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగ్గానే ఉందని, బ్యాంక్ వద్ద తగినన్ని మూలధన నిల్వలు ( Capital ) ఉన్నాయని ఆదిత్య పురి స్పష్టంచేశారు. అందుకే మీ ఉద్యోగాలకే కాదు.. మీ ప్రమోషన్స్ ( Job promotions), శాలరీ ఇంక్రిమెంట్స్ ( Salary increments), బోనస్‌లకు ( Salary bonus ) కూడా ఢోకా లేదని పురి తేల్చిచెప్పేశారు. పురి వ్యాఖ్యలనుబట్టి చూస్తే.. గడిచిన జులై- సెప్టెంబరు త్రైమాసికంతో పాటు రానున్న త్రైమాసికాల్లోనూ బ్యాంక్ చక్కటి ఆర్థిక ఫలితాలనే వెల్లడించే అవకాశం ఉందని అర్థమవుతోంది. Also read : Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe