SBI offers on loans: కరోనా కాలంలో రుణాలపై ఎస్బీఐ ఆఫర్స్

ఈ పండగల ఖర్చును ఎలా అధిగమించాలా అని ఆందోళన చెందుతున్న వారికోసమే అన్నట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  రుణాలపై భారీ ఆఫర్లను ( SBI offers on loans ) ప్రకటించింది. తమ మొబైల్ యాప్ అయిన యోనో యాప్‌ ( Yono app ) ద్వారా దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు కారు ( Car loans), పసిడి ( Gold loans ), వ్యక్తిగత రుణాలకు ( Personal loans ) సంబంధించి ప్రాసెసింగ్‌ ఫీజును 100 శాతం మాఫీ చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.

Last Updated : Sep 29, 2020, 10:53 PM IST
SBI offers on loans: కరోనా కాలంలో రుణాలపై ఎస్బీఐ ఆఫర్స్

ముంబై: కరోనావైరస్ ( Coronavirus ) తెచ్చిన కష్టాలతో డబ్బంటే ఎవరికైనా ఇబ్బందే అనేటటువంటి పరిస్థితి వచ్చి పడింది. కరోనా లాక్ డౌన్ కారణంగా సంస్థలు తీవ్ర నష్టాలు చవిచూస్తుండటంతో కొంతమంది ఉద్యోగాలు కోల్పోగా.. ఇంకొంతమందికి జీతాల్లో కోతల్లో పడింది. అదే సమయంలో పండుగల సీజన్ ( Festival season )‌ ప్రారంభమైంది. దీంతో ఈ పండగల ఖర్చును ఎలా అధిగమించాలా అని ఆందోళన చెందుతున్న వారికోసమే అన్నట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  రుణాలపై భారీ ఆఫర్లను ( SBI offers on loans ) ప్రకటించింది. 

తమ మొబైల్ యాప్ అయిన యోనో యాప్‌ ( Yono app ) ద్వారా దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు కారు ( Car loans), పసిడి ( Gold loans ), వ్యక్తిగత రుణాలకు ( Personal loans ) సంబంధించి ప్రాసెసింగ్‌ ఫీజును 100 శాతం మాఫీ చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. అప్రూవ్డ్ ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై 100 శాతం ప్రాసెసింగ్‌ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. Also read : SBI home loans: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

ఎస్బీఐ ఆఫర్స్ అంతటితో అయిపోలేదు. దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోర్ ( Cibil score), గృహ రుణ పరిమాణాన్ని బట్టి ( Home loans ) వారికి వడ్డీ రేటులో 10 బేసిస్‌ పాయింట్ల (Basis points ) వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ పొందే అవకాశం కల్పిస్తోంది. 

ఇక కార్ లోన్‌ తీసుకునే వారికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం కానుండగా.. ఎంపిక చేసిన మోడల్స్‌ కార్లపై 100 శాతం వరకు ఆన్‌–రోడ్‌ ఫైనాన్స్‌ కూడా అందిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు ( SBI Gold loans ), 9.6 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలు ( SBI Personal loans interest rates ) మంజూరు చేస్తున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది. Also read :  మహిళల Bank account లో లక్ష రూపాయలు డిపాజిట్.. ఇందులో నిజం ఎంత ?

యోనో యాప్ ద్వారా అప్లై చేసుకున్న వారికి పేపర్‌తో పని లేకుండానే ( Paperless loan approval) రుణాలు మంజూరు చేస్తున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. ఇదివరకే తీసుకున్న రుణాలపై టాప్ అప్ లోన్స్ ( Top-up loans ) సైతం ఇవ్వనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News