Hero EV Scooter: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్. అందుకే నెమ్మదిగా అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. త్వరలో హీరో మోటోకార్ప్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో వచ్చే యేడాదికి ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ వచ్చేస్తుంది. అటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్. అందుకే ప్రతి ఆటోమొబైల్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే నెలలో ఇండియాలో ప్రవేశపెట్టనుంది. కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతూనే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ద్విచక్రవాహనాల రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రభావం చూపిస్తాయనేది హీరో మోటోకార్ప్ కంపెనీ అంచనా. డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ 12.92 లక్షల వాహనాల్ని విక్రయించింది. ఈ ఏడాది సాధారణ బడ్జెట్‌లో చేిన ప్రకటనల కారణంగా ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాకుండా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని హీరో మోటోకార్ప్ భావిస్తోంది. 


జీఎస్టీ విషయంలో 1.4 లక్షల కోట్లతో అత్యధిక స్థాయికి చేరిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోందని కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఇతర రంగాలు కూడా క్రమక్రమంగా కోలుకుంటున్నాయని చెప్పారు. కళాశాలలు తెర్చుకోగానే..ఆతిధ్య వినోద రంగాలు సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేశారు. ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. హీరో మోటోకార్ప్ కంపెనీ 2022-23లో వ్యాపారం వృద్ధి చెందుతుందని ఆశిస్తోంది. పెట్టుబడుల వ్యయాన్ని గత బడ్జెట్‌తో పోలిస్తే 35 శాతం పెరుగుదల ఉంది. ఫలితంగా ఉపాధి, ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ఏడాది మార్చ్‌లో హీరో మోటోకార్ప్ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. కంపెనీ తన ఈవీ స్కూటర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. 


Also read: Amazon Fab Phones Fest: మొబైల్ ఫోన్లు, టీవీలపై అమెజాన్ అదిరే ఆఫర్లు- రేపే లాస్ట్​ ఛాన్స్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook