Hero Xoom Scooter: హీరో మోటోకార్ప్ నుంచి `జూమ్` వచ్చేసింది.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ! బుకింగ్‌లు ప్రారంభం
Hero MotoCorp Launched Xoom Scooter 110cc. హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. హీరో జూమ్ 110 పేరిట కొత్త స్కూటర్‌ను సోమవారం లాంచ్ చేసింది.
Hero MotoCorp Launched Hero Xoom 110cc Scooter at Rs 68599: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' భారత మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. 'హీరో జూమ్ 110' పేరిట కొత్త స్కూటర్‌ను సోమవారం లాంచ్ చేసింది. ఈ 110సీసీ స్కూటర్ టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా స్మార్ట్ వంటి స్కూటర్లతో పోటీ పడనుంది. హీరో జూమ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 68,599 లుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 76,699 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా యాక్టివా స్మార్ట్ కంటే దాదాపు రూ. 10 వేలు చౌకగా ఉంటుంది.
హీరో జూమ్ 110 స్కూటర్‌ను మూడు వేరియంట్లలో (Hero Xoom LX, Hero Xoom VX, Hero Xoom ZX) హీరో మోటోకార్ప్ తీసుకొస్తోంది. వీటిలో ఎల్‌ఎక్స్ ధర రూ.68,599 (ఎక్స్‌షోరూం), వీఎక్స్ ధర రూ.71,799 (ఎక్స్‌షోరూం), జెడ్‌ఎక్స్ ధర రూ. 76,699 (ఎక్స్‌షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ స్కూటర్ ప్రత్యేకతలు, డిజైన్ చాలా బాగున్నాయి.
బ్లూటూట్ కనెక్టివిటీ, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు హీరో జూమ్ 110లో ఉన్నాయి. 110సీసీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్ ఇంజిన్ 7250 ఆర్‌ఎంపీ వద్ద 8బీహెచ్‌పీని, 5750 ఆర్‌ఎంపీ వద్ద 8.7ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ ఐ3ఎస్ టెక్నాలజీతో విడుదల అయింది. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఈ కొత్త స్కూటర్ నారింజ, నలుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఆధునిక హంగులతో హీరో జూమ్ 110మీ మార్కెట్‌లోకి వస్తోంది. ఎచ్-షేప్డ్ LED DRLs, ఎక్స్ షేప్డ్ టెయిల్ ల్యాంప్‌లతో ఈ స్కూటర్ రానుంది. దీనికి కార్నరింగ్ లైట్లను కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా 12 అంగుళాలు కలిగిన అలాయ్‌వీల్స్.. ఇది 1300mm వీల్‌బేస్, 1843mm పొడవు, 717 mm వెడల్పు, 1188 mm ఎత్తు ఉంది. X వేరియంట్‌కు 731 mm బాడీని ఇచ్చారు. హీరో జూమ్ 110 సీసీ సింగల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్‌తో వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.