Sitara Ghattamaneni Dance: మహేశ్‌ బాబు సాంగ్‌కు స్టెప్పులేసిన సితార.. త్రిషను మైమరిపించేసిన ఘట్టమనేని వారసురాలు!

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Latest Dance Video Goes Viral. తాజాగా తండ్రి మహేశ్‌ బాబు సాంగ్‌కు స్టెప్పులేసి అందరిచే ఔరా అనిపించుకుంది సూపర్ స్టార్  ముద్దుల తనయ సితార.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 30, 2023, 07:48 PM IST
  • మహేశ్‌ బాబు సాంగ్‌కు స్టెప్పులేసిన సితార
  • త్రిషను మైమరిపించేసిన ఘట్టమనేని వారసురాలు
  • మహేష్ బాబు అభిమానులు ఫిదా
Sitara Ghattamaneni Dance: మహేశ్‌ బాబు సాంగ్‌కు స్టెప్పులేసిన సితార.. త్రిషను మైమరిపించేసిన ఘట్టమనేని వారసురాలు!

Mahesh Babu Daughter Sitara shake a leg for Pillagali Allari Song: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా చురుగ్గా ఉండే సీతూ పాప.. నిత్యం తనకు సంబందించిన ఫొటోస్, వీడియోలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో షేర్‌ చేస్తుంటుంది. 'సర్కారు వారి' సినిమా ద్వారా ల్యామ్ లైట్‌లోకి వచ్చిన సితార.. ఎప్పటికపుడు మహేష్ అభిమానులను అలరిస్తుంది. తాజాగా తండ్రి మహేశ్‌ బాబు సాంగ్‌కు స్టెప్పులేసి అందరిచే ఔరా అనిపించుకుంది.

2005లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష జంటగా వచ్చిన సినిమా 'అతడు'. ఈ సినిమాలో 'పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..' అనే పాటకు త్రిష వేసిన స్టెప్పులను ఎప్పటికి ఎవరూ మర్చిపోలేరు. ఇదే పాటకు తాజాగా మహేష్ బాబు ముద్దుల కూతురు సితార స్టెప్స్ వేసి అలరించింది. అచ్చు త్రిష వేసిన మాదిరిగానే స్టెప్స్ వేసి సీతూ పాప అదరగొట్టేసింది. సితార క్యూట్‌ డ్యాన్స్‌ వీడియోను సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

అదిరే స్టెప్పులేసిన సితార క్యూట్‌ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. సీతూ పాప హావభావాలకు మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు. పదేళ్ల వయసున్న సితార రానున్న సంవత్సరాలలో ఘట్టమనేని వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ కూతురు చదువుతో పాటు సంగీతం, డ్యాన్స్ నేర్చుకుంటోంది. మరోవైపు సూపర్ స్టార్ వారసుడు గౌతమ్ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 'వన్- నేనొక్కడినే' సినిమాలో గౌతమ్ నటించాడు. ప్రస్తుతం అతడు చదువుపై శ్రద్ద పెట్టాడు. 

Also Read: SuryaKumar Yadav: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?  

Also Read: Hardik Pandya: ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను.. హార్దిక్ పాండ్యా చెత్త నిర్ణయంపై గౌతమ్ గంభీర్‌ అసహనం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News