హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇండియన్ షేర్ మార్కెట్, అదానీ గ్రూప్ పరిస్థితిని పాడు చేసేస్తోంది. బుధవారం తరువాత శుక్రవారం నాడు షేర్ మార్కెట్‌లో వచ్చిన క్షీణత..మూడో స్థానంలో ఉన్న అదానీని 7వ స్థానానికి మార్చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చాలా శక్తివంతమైన రిపోర్ట్. ఈ కంపెనీ ఏ కంపెనీపై నివేదిక ఇస్తుందో ఆ కంపెనీ షేర్లు పడిపోవల్సిందే. టార్గెట్ చేసి మరీ కొడుతుంటుంది. అదే జరిగింది. అదానీ గ్రూప్ టార్గెట్ చేసి విడుదల చేసిన రిపోర్ట్ కారణంగా అదానీ కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. దేశంలో అత్యంత ధనికుడిగా ఉన్న వ్యక్తి సంపదలో 4 లక్షల కోట్లను ఈ రిపోర్ట్ క్లీన్ చేసేసింది. రిపోర్ట్ కారణంగా కంపెనీ షేర్లు వేగంగా పడిపోతున్నాయి. 


అదానీ గ్రూప్ షేర్లలో క్షీణత


శుక్రవారం మార్కెట్ క్లోజ్ సమయానికి అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లలో 20 శాతం క్షీణత నమోదైంది. ఇవి కాకుండా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 18 శాతం, అంబూజా సిమెంట్ 16 శాతం, అదానీ పోర్ట్స్ 15 శాతం, ఏసీసీ సిమెంట్ 12 శాతం, అదానీ విల్మార్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం క్షీణత నమోదు చేశాయి.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రపంచంలోని మూడవ అత్యంత ధనికుడైన వ్యక్తి ఏ విధంగా కార్పొరేట్ ఇండస్ట్రీలో అత్యంత మోసపూరితమైన పనికి పాల్పడ్డారనే శీర్షికతో నివేదిక ప్రచురించింది. అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్ వ్యాల్యూని ఎలా మ్యానిప్యులేట్ చేశాయో చెబుతూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. కంపెనీ అదానీ గ్రూప్‌పై చేసిన 5 ప్రధాన ఆరోపణలు ఇవీ..


1. అదానీ గ్రూప్ కంపెనీలు షేర్ల ధరల్ని మ్యానిప్యులేట్ చేశాయి. ఎక్కౌంట్ మోసాలకు పాల్పడింది.


2. అదానీ గ్రూప్ విదేశాల్లో చాలా షెల్ కంపెనీలు సృష్టించి ట్యాక్స్ ఎగవేతకు పాల్పడింది.


3. మారిషస్, కరేబియన్ దీవుల్లో చాలా బినామా కంపెనీల్లో అదానీ గ్రూప్ కంపెనీలు వాటా ఉంది.


4. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలపై భారీగా రుణాలున్నాయి. ఈ రుణాలు మొత్తం గ్రూప్‌‌ని ఆర్ధిక విపత్తు స్థితికి తీసుకొచ్చాయి.


5. అధిక విలువ కట్టడం ద్వారా కంపెనీ షేర్ల విలువ 85 శాతం వరకూ పెంచి చూపిస్తోంది. 


ఈ రిపోర్ట్ ప్రభావం ఎంత దారుణంగా పడిందంటే..కేవలం 2 రోజుల్లోనే అదానీ గ్రూప్ భారీగా నష్టాన్ని ఎదుర్కొంది. గ్రూప్‌పై నివేదిక చూపించిన 3 ప్రభావాలు..


1. జనవరి 25 నుంచి జనవరి 27 మధ్య కాలంలో అంటే రెండ్రోజుల్లో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 4 లక్షల 10 వేల రూపాయలు నష్టపోయాయి. జనవరి 25న మార్కెట్ క్యాప్ దాదాపు19 లక్షల కోట్ల రూపాయలుంది. అది కాస్తా క్షీణించి 15 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే 25 శాతం క్షీణత నమోదైంది. 


2. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 20 వేల కోట్ల రూపాయలు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఎఫ్‌పీవోను కూడా శుక్రవారమే ఓపెన్ చేసింది. దీని ప్రైస్‌బ్యాండ్ 3112 నుంచి 3276 రూపాయలు షేర్ నిర్ణయించారు. కానీ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రభావంతో తొలిరోజున కేవలం 1 శాతమే సబ్‌స్క్పైబ్ అయింది.


3. ఫోర్బ్స్ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మూడవ స్థానం నుంచి పడిపోయి..7వ స్థానానికి చేరుకున్నారు. జనవరి 25వ తేదీన అతడి నికర విలువ 9 లక్షల 71 వేల 500 కోట్ల రూపాయలుంటే..జనవరి 27 నాటికి 7 లక్షల 86 వేల 400 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే కేవలం రెండ్రోజుల్లో 1 లక్షా 85 వేలకోట్లు నష్టం వాటిల్లింది. 


Also read: Hindenburg Research: అదానీ గ్రూప్‌పై స్కామ్ ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎక్కడిది, ఈ సంస్థ ఏం చేస్తుందసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook