Hindustan Aeronautics Ltd: దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్ల పాలిట  కల్పవృక్షంగా నిలిచింది.ఇప్పటికే ఈ స్టాక్ గడచిన సంవత్సర కాలంగా 150 శాతం పెరిగింది.ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి గమనించినట్లయితే  దాదాపు 1500% పెరిగింది.తాజాగా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)తో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది.ఈ ఒప్పందం,మొత్తం విలువ రూ.2,970 కోట్లు కాగా దీంతో HAL ఆర్డర్ బుక్ విలువ ఇప్పటికే రూ.96 వేల కోట్లకు చేరి రూ.1 లక్ష కోట్లకు చేరుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) భారతదేశ రక్షణ విమానయాన అవసరాల కోసం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ.ఇది విమానాలు,హెలికాప్టర్లు,ఇంజిన్‌ల రూపకల్పన,తయారీ,మరమ్మత్తు,నిర్వహణలో ప్రత్యేకత కలిగి ఉంది.ఇది దేశ రక్షణ కార్యక్రమానికి కీలకమైన సరఫరాదారుగా మారింది.HAL త్రైమాసిక ఫలితాల ప్రకారం,Q4తో పోలిస్తే నికర అమ్మకాలు 18.2శాతం పెరిగి రూ.14,768 కోట్లకు చేరాయి.ఇక నిర్వహణ లాభం 62.8 శాతం పెరిగి రూ.6,458.6కోట్లకు చేరుకుంది.నికర లాభం 51.1శాతం పెరిగి రూ.4,296.9కోట్లకు చేరుకుంది.కంపెనీ వార్షిక ఫలితాల్లో, నికర అమ్మకాలు 12.8శాతం పెరిగి రూ. 30,381 కోట్లకు చేరుకోగా,నిర్వహణ లాభం 39.4శాతం పెరిగి రూ.11,637కోట్లకు చేరుకుంది.నికర లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 30.4 శాతం పెరిగి రూ.7,594 కోట్లకు చేరుకుంది. 


Also Read : Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!


అదనంగా, కంపెనీ షేర్ల ను స్ప్లిట్ చేసింది.సెప్టెంబరు 28, 2023న ప్రస్తుతం ఉన్న ప్రతి రూ. 10 ఈక్విటీ షేర్‌ను రెండు రూ.5 ఈక్విటీ షేర్‌లుగా విభజించింది.అదనంగా,కంపెనీ ఆగస్టు 24,2023న ఒక్కో షేరుకు రూ.15 తుది డివిడెండ్ చెల్లించింది.2024 మార్చి నాటికి 71.64 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంది.కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,20,000 కోట్లకు పైగా ఉంది 26 శాతం డివిడెండ్ చెల్లింపును కొనసాగిస్తోంది. కంపెనీ మార్చి 31,2024 నాటికి రూ.94,000 కోట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. స్టాక్ కేవలం 1 సంవత్సరంలో 150 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. 3 సంవత్సరాలలో 790 శాతం భారీ రాబడిని ఇచ్చింది.


Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


Also Read : Post Office Savings Account vs SBI Savings Account: పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ vs SBI సేవింగ్స్ అకౌంట్.. రెండింటిలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి