Honda Hness CB350 and Honda CB350RS launches in India: భారతదేశంలోని 350 సిసి బైక్ సెగ్మెంట్‌లో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఆధిపత్యం చెలాయిస్తోంది. కంపెనీకి చెందిన క్లాసిక్ 350 ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా ప్రముఖ ద్విచక్ర కంపెనీ 'హోండా' కూడా CB350 బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ బైక్‌లు పెద్దగా విజయవంతం కాలేదు. ఇప్పుడు హోండా కంపెనీ ఈ బైక్‌లను తన అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. ఈ బైక్ రెండు మోడళ్లలో (Hness CB350 మరియు CB350RS) విక్రయించబడింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లకు స్వల్ప మార్పులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 Hness CB350 మరియు CB350RSలో మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బైక్‌లు ఇప్పుడు OBD2-B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) సిస్టమ్‌తో అమర్చబడ్డాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి అన్ని ద్విచక్ర వాహనాలలో ఈ సిస్టమ్ తప్పనిసరి. కంపెనీ ఇందులో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS)ని కూడా చేర్చింది. ఇది అత్యవసర బ్రేకింగ్ విషయంలో వెనుక ఉన్న వాహనాలను అప్రమత్తం చేయడానికి టర్న్ సిగ్నల్‌ను సక్రియం చేస్తుంది.


ఆర్ఎస్ వెర్షన్ బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఈ  మోటార్‌సైకిళ్లలో ఉంటుంది. ఇది ఇప్పటికే Hnessలో అందుబాటులో ఉంది. హోండా కంపెనీ ఈ బైక్‌లకు కొత్త స్ప్లిట్-టైప్ సీటు ఇవ్వబడింది. ఇది మునుపటికంటే మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ మార్పులతో బైక్‌ల ధరలు కూడా పెరిగాయి. హోండా ఈ బైక్‌ల ధరలను రూ. 11,000 వరకు పెంచింది. ఇప్పుడు Hness ధర రూ.2.10 లక్షల నుంచి  మొదలవుతుంది.


ఈ బైక్‌ల ఇంజన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది 348.6cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 20.78bhp మరియు 30Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పూర్తి-LED లైటింగ్, హజార్డ్ ల్యాంప్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, USB ఛార్జింగ్ పోర్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఇన్‌స్ట్రుమెంటేషన్ సెటప్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సెమీ-డిజిటల్ కన్సోల్ ఉంటుంది.


Also Read: Oscar Awards 2023: ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆశలన్నీ నీరుగార్చిన ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌!  


Also Read: Virat Kohli: ఆమెను కలిసిన క్షణం నా జీవితమే మారిపోయింది.. విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.