Virat Kohli: ఆమెను కలిసిన క్షణం నా జీవితమే మారిపోయింది.. విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli praises Wife Anushka Sharma. నా భార్య అనుష్క శర్మతో మొదలైన పరిచయంతోనే తన జీవితం మారిపోయిందని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 11, 2023, 02:43 PM IST
  • ఆమెను కలిసిన క్షణం నా జీవితమే మారిపోయింది
  • విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023తో కోహ్లీ బిజీ
Virat Kohli: ఆమెను కలిసిన క్షణం నా జీవితమే మారిపోయింది.. విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

When I Met Anushka Sharma my life totally changed says Virat Kohli: ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్‌లలో 'విరాట్ కోహ్లీ' ఒకడు. ప్రత్యర్థి ఎవరైనా.. బౌలర్ ఎలాంటోడైనా.. మైదానం ఎలా ఉన్నా.. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ బరిలోకి దిగితే పరుగుల వరద పారుతుంది. తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. చేజింగ్ కింగ్, రికార్డుల రారాజు, బ్యాటింగ్ మాస్ట్రో కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రికెటర్‌గా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో నిర్ణయాత్మక క్షణాలను ఎదుర్కొన్నాడు. అయితే తన భార్య అనుష్క శర్మను కలిసిన క్షణం తన జీవితమే మారిపోయిందని కోహ్లీ తాజాగా తెలిపాడు. 

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పాడ్‌కాస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మా నాన్న  దూరమైన క్షణం జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చింది. ఆ సంఘటన భవిష్యత్తుపై నా ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చింది. అయితే నా జీవితం మాత్రం అస్సలు మారలేదు. నా చుట్టూ ఉన్న ప్రపంచం మునపటి లాగే ఉంది. నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాను’ అని అన్నాడు. 

'నా భార్య అనుష్క శర్మతో మొదలైన పరిచయంతోనే నా జీవితం మారిపోయింది. అప్పుడే నా జీవితంలో మరో కోణం చూశాను. నా ప్రపంచం మునుపటిలా లేదు. పూర్తిగా మారిపోయిందని అనిపించింది. ప్రేమలో పడినప్పుడు ఆ మార్పులు మీలో కూడా రావడం ప్రారంభమవుతాయి. కొన్ని విషయాలను అంగీకరించాలి. భవిష్యత్తుల్లో ఇద్దరు కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి మార్పు మొదలవుతుంది. అందుకే అనుష్కను కలిసిన క్షణాన్ని లైఫ్ ఛేంజింగ్ మూమెంట్‌గా చెప్తాను' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని స్నేహితులు అయ్యారు. రోజులు గడిచేకొద్ది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఐదారేళ్లు లవ్‌లో ఉన్న ఈ ఇద్దరు.. 2017 డిసెంబరులో ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021 జనవరి 11న వామికాకు అనుష్క జన్మనిచ్చింది.  ఇక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023తో కోహ్లీ బిజీగా ఉన్నాడు. చక్దా ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో అనుష్క నటిస్తోంది. టీమిండియా మాజీ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Also Read: Oscar Awards 2023: ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆశలన్నీ నీరుగార్చిన ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌!  

Also Read: Oscar 2023 Nominations: 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా అన్ని విభాగాలకు చెందిన లిస్ట్ ఇదే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News