Honda Activa Limited Edition: దేశంలోని అతిపెద్ద స్కూటీ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) మరో కొత్త ఎడిషన్ ను అందుబాటులోకి తెచ్చింది. సూపర్ హిట్ అయిన యాక్టివా సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ ను హోండా సంస్థ విడుదల చేసింది. కొత్త హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ ఆకర్షణీయమైన ధర రూ.80,734 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ బుకింగ్‌లు ఇప్పుటికే ఓపెన్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత కాలం పాటు ఈ బుకింగ్ అందుబాటులో ఉండనుంది. ఈ హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ విడుదలపై HMSI మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ శ్రీ సుత్సుము ఒటాని మాట్లాడారు. "Activa గత రెండు ఏళ్లుగా భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.


మిలియన్ల మంది భారతీయుల్లో సంతోషాన్ని నింపింది. హోండా స్కూటీ అన్ని వయసుల సమూహాల్లో ప్రజాదరణ కొనసాగిస్తూ.. దేశంలో అత్యంత ఇష్టపడే స్కూటర్ గా నిలిచింది. ఈ సరికొత్త ఎడిషన్ లాంఛ్ మా కస్టమర్లను, మరీ ముఖ్యంగా కొత్తతరాన్ని ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నాం" అని HMSI సీఈఓ అన్నారు. 


Also Read: ICC World Cup 2023: ఈసారి ప్రపంచకప్‌లో మూడు కొత్త నిబంధనలతో సిద్ధమైన ఐసీసీ


Activa సరికొత్త ఎడిషన్ డిజైన్
Activa లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ మోడల్.. డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో రానుంది. బాడీ ప్యానెల్ లపై స్ట్రైకింగ్ స్ట్రైప్స్ తో పాటు మరింత మెరుగ్గా కనిపిస్తుంది. Activa 3D సింబల్ ప్రీమియం బ్లాక్ క్రోమ్ గార్నిష్‌ తో వస్తుంది. వెనుక గ్రాబ్ రైల్ కూడా బాడీ కలర్ డార్క్ ఫినిషింగ్‌ను పొందుతుంది.


కుర్రకారు కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ ను కలిగి ఉంది. ఇప్పుడు DLX వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. అయితే టాప్ - స్పెక్ వేరియంట్ హోండా లో విప్లవాత్మక స్మార్ట్ కీని కలిగి ఉంది. చివరిగా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌లో 109.51cc, సింగిల్-సిలిండర్, BS VI OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజన్, 5.77 kW పవర్.. 8.90 Nm టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.


Also Read: Indian Railways: వైష్ణోదేవికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్, ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 22



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook