ICC World Cup 2023: ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులకు ఒకటే ఆసక్తి నెలకొంది. అది వన్డే ప్రపంచకప్ 2023, మరో మూడ్రోజుల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ జరిగే టోర్నీకు ఐసీసీ కొత్తగా మూడు నిబంధనలు సిద్ధం చేసింది. ఆ నిబందనల గురించి తెలుసుకుందాం..
నో సాఫ్ట్ సిగ్నల్ రూల్
ప్రపంచకప్‌కు ముందే అంపైరింగ్ నియమాన్ని మార్చారు. ఐసీసీ సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేసింది. అంటే అంపైర్ ఏదైనా వికెట్ కోసం ధర్డ్ అంపైర్ సహాయం తీసుకోవాలనుకుంటే మొదటి అంపైర్‌తో మాట్లాడి అప్పుడు తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ధర్డ్ అంపైర్ వికెట్ సరిగ్గా పరిశీలించలేకపోతే గ్రౌండ్‌లో అంపైర్ నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఇది వివాదాస్పదం కావడంతో రద్దు చేశారు. ఇకపై ఫుటేజ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
బౌండరీ కౌంట్ రూల్ రద్దు
2019 ప్రపంచకప్ తరువాత ఈ నిబంధన చర్చకొచ్చింది. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపారు. ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఉంటుంది. సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీ కౌంట్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇక ఈ నిబంధన ప్రపంచకప్‌లో కన్పించదు. మ్యాచ్ డిసైడ్ అయ్యేంతవరకూ సూపర్ ఓవర్లు ఆడాల్సిందే.
ఐసీసీ బౌండరీ రూల్
ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా కొన్ని వేదికలకు ఐసీసీ బౌండరీ నిబంధనలు సెట్ చేసింది. దీని ప్రకారం స్డేడియంలో 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువే ఉండాలి. అంటే బౌండరీ పరిధిని 70 మీటర్లకు తక్కువ కాకుండా ఉండేట్టు చూసుకోవాలి.
Also read: Watch: 'తిరువనంతపురం' అని పలకలేక ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు, ఫన్నీ వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook