Honda Activa as EV: హోండా యాక్టివా స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీ చేసేశాడు.. మాడిఫికేషన్ ఖర్చు, మైలేజ్ రేంజ్ ఎంతో తెలుసా ?
Honda Activa as EV: పదేళ్ల క్రితం మోడల్ స్కూటీ పెట్రోల్ ఇంజన్ మాడిఫై చేసి ఎలక్ట్రిక్ బైక్‌గా తీర్చిదిద్దారు. వాస్తవానికి హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్ ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే.. ఇతను పాత హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చడం చూసి నెటిజెన్స్ సైతం సూపర్ అని కితాబిస్తున్నారు.
Honda Activa as EV: ఎప్పుడైతే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ వాహనాలపై కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారి దృష్టి అంతా వీలైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనే ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తుండటంతో వాటి ఖరీదు కూడా అంతే భారీగా ఉంటోంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉండటం, సాంకేతికంగా వాటి మేకింగ్ కొంత ఖర్చుతో కూడుకున్నది కావడం వల్లే ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదు ఎక్కువగా ఉండటానికి కారణమైంది. ఒకవేళ తమ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయలేకపోతున్నామే అని నిరాశకు గురైన వారు.. తమ తెలివితేటలు ఉపయోగించి తమ వద్ద ఉన్న వాహనాలనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మాడిఫై చేసి ఆటోమొబైల్ రంగంలో తమ సత్తా చాటుకోవడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను సొంతం చేసుకోవాలనే తమ కోరికను కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇంకొంత మంది ఆ తెలివితేటలను ఉపయోగించి ఇతరులకు కూడా ఆర్డర్లపై ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి ఇస్తున్నారు.
ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే. Diy Tech.in పేరుతో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో చూస్తే మీరు అవాక్కవక మానరు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక హోండా స్కూటీని తీసుకుని దానిని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేశారు. అది కూడా కొత్త స్కూటీ కాదు.. 2012 నాటి మోడల్.. అంటే పదేళ్ల క్రితం స్కూటీ అన్నమాట.
పదేళ్ల క్రితం మోడల్ స్కూటీ పెట్రోల్ ఇంజన్ మాడిఫై చేసి ఎలక్ట్రిక్ బైక్‌గా తీర్చిదిద్దారు. వాస్తవానికి హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్ ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే.. ఇతను పాత హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చడం చూసి నెటిజెన్స్ సైతం సూపర్ అని కితాబిస్తున్నారు. హోండా యాక్టివా స్కూటీని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చడం కోసం తనకు రూ. లక్ష రూపాయల ఖర్చు అయిందని.. ఈ బైక్ సింగిల్ చార్జింగ్‌తో 120 కిమీ రేంజ్ మైలేజ్ ఇస్తుందని ఈ ఎలక్ట్రిక్ స్కూటీ సృష్టికర్త చెబుతున్నారు. కేవలం ఇంజన్ మాడిఫికేషన్ కాకుండా ఎలక్ట్రిక్ అని గ్రాఫిక్స్ కూడా చేసి హోండా యాక్టివా రూపురేఖలనే మార్చేశారు.
ఇది కూడా చదవండి : OPPO Reno 8T 5G: అద్దిరిపోయే ఫీచర్స్‌తో ఒప్పో రెనో 8T 5G వచ్చేస్తోంది.. లాంచింగ్ డేట్ ఇదిగో..
ఇది కూడా చదవండి : Toyota Urban Cruiser Hyryder CNG: టయోటా నుంచి సూపర్ ఎస్‌యూవి కారు.. క్రెటా, గ్రాండ్ వితారా పరిస్థితి ఏంటి ?
ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook