Honda Cars Prices: హోండా కార్లపైనే ఇష్టం పెంచుకుని, వాటినే కొనాలని ప్లాన్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుండి కఠినమైన ఉద్గార నిబంధనలు అమలులోకి రానుండగా.. అందుకు అనుగుణంగా కార్లను తయారీ చేసే క్రమంలో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని అందుకునేందుకు హోండా కార్స్ ఇండియా ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే ముందుగా తన ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధరలను రూ.12,000 వరకు పెంచాలని హోండా భావిస్తోంది. హోండా అమేజ్ కారు మోడల్ వేరియంట్స్ ని బట్టి కార్ల ధరల పెరుగుదల మారుతూ ఉంటుందని హోండా స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

" ఏప్రిల్ 1 నుండి కఠినమైన ఉద్గార నిబంధనలు అమలులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పెరిగిన ఉత్పత్తి వ్యయం భారాన్ని తగ్గించుకునేందుకు తాము హోండా అమేజ్ కారు ధరలను రూ. 12,000 వరకు పెంచుతున్నాం" అని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ పిటిఐకి ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.


అయితే, అదే సమయంలో హోండా కార్స్ ఇండియా కంపెనీ మీడియం లెవెల్ సెడాన్ సిటీ కారు ధరల్లో మార్పులు చేయడం లేదని కునాల్ బెహల్ పీటీకి ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తమ ఉత్పత్తులను BSVI 2వ దశ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తోంది అని అన్నారు.


మారుతున్న కఠిన నిబంధనల దృష్ట్యా ఏప్రిల్ 1 నుండి, వాహనాలు రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను సెల్ఫ్ చెక్ చేసుకునేలా కారులో స్వీయ నిర్ధారణ పరికరాన్ని అమర్చాల్సి ఉంటుంది. కారు నుంచి వెలువడే ఉద్గారాలపై ఫోకస్ చేసేలా కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్స్ వంటి ఎమిషన్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా కారు ఇంజన్‌లోని కీలక భాగాలను స్వతహాగా పర్యవేక్షిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. హోండా కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా వాహనాల ధరలు పెంచే అవకాశం ఉంది. ఇదిలావుంటే, ఏప్రిల్ 1, 2023 నుండి టాటా మోటార్స్ వాణిజ్య అవసరాలకు వినియోగించే వాహనాల ధరలను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి : PAN Card, Aadhaar Card Linking: పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింకింగ్ ఎవరెవరికి అవసరం లేదంటే..


ఇది కూడా చదవండి : Rs 1 lakh Monthly Salary Job: మీకు మీమ్స్ చేయడం వచ్చా ? నెలకు లక్ష రూపాయల శాలరీ ఇచ్చే జాబ్ రెడీ


ఇది కూడా చదవండి : Tata Safari: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK