Rs 1 lakh Monthly Salary Job: మీమ్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాడు అని మీమ్స్ చేసేవారిని చిన్నచూపు చూస్తున్నారా ? మీమ్స్ చేస్తూ టైమ్ పాస్ చేస్తే జీవితంలో ఎలా పైకొస్తావ్ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారా ? అయితే డోంట్ వర్రీ.. అలాంటి వాళ్లకు ఇదిగో ఈ ఉద్యోగానికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పండి.. వాళ్లు ఏపాటి మీమ్స్ రాయుళ్లో తెలుస్తుంది. మీమ్స్ చేసే తెలివితో పాటు ఆర్థిక వ్యవహారాలు, స్టాక్ మార్కెట్ వంటి అంశాలపై కొంత లోకజ్ఞానం కూడా తోడయితే.. వారి కోసం మా వద్ద ఉద్యోగం రెడీగా ఉందంటోంది బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ.
మాకు మీమ్స్ చేయడం తప్ప ఏమీ రాదు.. ఇప్పుడెలా బతకడం అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ జాబ్ ఆపర్చునిటీని అందిపుచ్చుకున్నారే అనుకోండి.. చీఫ్ మీమ్ ఆఫీసర్ అనే పోస్టును సొంతం చేసుకోవడంతో పాటు నెలకు లక్ష రూపాయల జీతం మీ బ్యాంకు ఖాతాలో పడినట్టే. ఏంటి వెటకారమా.. చీఫ్ మీమ్ ఆఫీసర్ పోస్టు ఏంటి.. అందుకోసం నెలకు రూ లక్ష రూపాయల జీతం చెల్లించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అవును.. మేం చెప్పేది నిజమేనండి.. ఇదేం సరదాగా చెప్పడం లేదు. నమ్మకపోతే ఇదిగో ఈ వివరాలు మీ కోసమే.
బెంగళూరుకు చెందిన స్టాక్ స్టిమ్యులేషన్ యాప్ అయిన స్టాక్‌గ్రో అనే స్టార్టప్ సంస్థ ఈ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన పోస్టును లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. ఎప్పుడైతే స్టాక్‌గ్రో సంస్థ ఈ పోస్ట్ పెట్టిందో.. అప్పటి నుంచి ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది... అంతేకాదు, ఎంతోమంది నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫైనాన్స్, స్టాక్ మార్కెట్‌లో అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు నవ్వించే రీతిలో మీమ్స్ రూపంలో ప్రజెంట్ చేసి జనాన్ని తమ వైపు తిప్పుకునే ఆలోచనతో స్టాక్‌గ్రో ఈ సరికొత్త ఐడియాతో కస్టమర్స్ ముందుకొచ్చింది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా ? ఆర్థిక వ్యవహారాలు, స్టాక్ మార్కెట్ తదితర అంశాలపై పట్టు ఉందా ? ఆకట్టుకునే రీతిలో మీమ్స్ క్రియేట్ చేయగలరా .. ? అయితే ఇది మీకోసమే అంటూ స్టాక్‌గ్రో సంస్థ మీమ్స్ రాయుళ్లను ఊరిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. మీమ్స్ క్రియేట్ చేసేలా మీకున్న పరిజ్ఞానం టైమ్ పాస్ కాదు.. అది కూడా ఒక జ్ఞానమే అనిపించుకుంటే అద్భుతమైన జాబ్‌తో పాటు అద్భుతమైన శాలరీ కూడా రెడీ.
ఇది కూడా చదవండి : Tata Safari: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్
ఇది కూడా చదవండి : Tata Motors: టాటా కమెర్షియల్ వాహనాల కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్
ఇది కూడా చదవండి : SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK