Dussehra Car Offers: దసరా పురస్కరించుకుని హోండా ఇండియా ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. కంపెనీ వాహనాలపై ఈనెల అంటే అక్టోబర్‌లో భారీ తగ్గింపు ఇస్తోంది. వివిద రకాల డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రస్తుతం రెండు కార్లపైనే అందిస్తోంది హోండా కంపెనీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కారు కొనుగోలు చేసే ఆలోచన ఉంటే ఇదే సరైన సమయం. వివిధ కారు కంపెనీలు దసరా పురస్కరించుకుని కొన్ని ఎంపిక చేసిన మోడల్ కార్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. కేవలం ఈనెల మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్లు వర్తించనున్నాయి. ఇందులో భాగంగానే హోండా ఇండియా రెండు కార్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ ఆఫర్ ఇతర ప్రయోజనాల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. అయితే హోండా ఇండియా కంపెనీ ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను కేవలం హోండా సిటీ, హోండా ఎమేజ్‌పై మాత్రం ఇస్తోంది. ఇటీవలే లాంచ్ అయిన హోండా ఎలివేట్‌పై ఎలాంటి ఆఫర్ లేదు. అక్టోబర్ నెలలో హోండా సిటీ, హోండా ఎమేజ్‌పై 75 వేల రూపాయల వరకూ అదా చేయవచ్చు. ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం.


హోండా ఎమేజ్‌పై డిస్కౌంట్ ఆఫర్ 


హోండా ఎమేజ్‌పై కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈనెల అంటే అక్టోబర్‌లో 57 వేల రూపాయలు వరకూ తగ్గింపు ఆఫర్ ఇస్తోంది. ఇందులో 15 వేల రూపాయలు నేరుగా క్యాష్ డిస్కౌంట్ లేదా 18,147 రూపాయలు వరకూ ఉచిత యాక్సెసరీస్ అందిస్తుంది. లాయల్టీ బోనస్ కింద కస్టమర్లకు 4 వేల రూపాయలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో 3 వేల రూపాయలు, ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్ పేరుతో మరో 20 వేల రూపాయలు, ఎక్స్చైంజ్ బోనస్ 15 వేలు అందుతాయి.


హోండా సిటీపై డిస్కౌంట్ ఆఫర్


హోండా సిటీ పెట్రోల్ వెర్షన్‌పై ఈనెలలో 75 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ క్యాష్ డిస్కౌంట్, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో లభిస్తుంది. ఈ కారుపై 25 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ లేదా 26,947 రూపాయల ఉచిత యాక్సెసరీస్ అందిస్తుంది. లాయల్టీ బోనస్ 4 వేల రూపాయలు, ఎక్స్చేంజ్ బోనస్ 6 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ 5 వేలు, ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్ 20 వేల రూపాయలు లభిస్తాయి. అయితే హోండా సిటీ హైబ్రిడ్ మోడల్‌పై ఏ విధమైన ఆఫర్ అందుబాటులో లేదు. ఈ రెండు కార్లపై దసరా ఆఫర్ కేవలం ఈనెలలోనే అందుబాటులో ఉంటుంది.


Also read: Maruti Suzuki: సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీగా కొత్త స్విఫ్ట్ త్వరలో లాంచ్, మైలేజ్ వింటే ఇక ఆగరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook