Maruti Suzuki: సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీగా కొత్త స్విఫ్ట్ త్వరలో లాంచ్, మైలేజ్ వింటే ఇక ఆగరు

Maruti Suzuki: మారుతి సుజుకి కార్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా మారుతి స్విఫ్ట్ చెప్పవచ్చు. అందుకే కంపెనీ ఇదే కారుని ఎస్‌యూవీగా కొత్త లుక్‌తో లాంచ్ చేస్తోంది. మైలేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2023, 07:20 PM IST
Maruti Suzuki: సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీగా కొత్త స్విఫ్ట్ త్వరలో లాంచ్, మైలేజ్ వింటే ఇక ఆగరు

Maruti Suzuki: దేశంలో ఎన్నో కారు తయారీ కంపెనీలున్నా ఏళ్ల తరబడి విశ్వాసాన్ని చూరగొన్న బ్రాండ్ మారుతి సుజుకి మాత్రమే. అందుకే మారుతి సుజుకి ఉత్పత్తులు అన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయి. ఇందులో అత్యధిక ప్రజాదరణ పొందిన కారు మారుతి స్విఫ్ట్. ఇప్పటికీ మారుతి స్విఫ్ట్ అమ్మకాలు గణనీయంగానే ఉంటున్నాయి. 

మారుతి సుజుకి కార్లలో స్విఫ్ట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కంపెనీ ఇప్పుడు సరికొత్త లుక్‌లో లాంచ్ చేస్తోంది. మారుతి కంపెనీ ఇప్పుుడు స్విఫ్ట్‌కు ఎస్‌యూవీ లుక్ ఇస్తోంది. న్యూ స్విఫ్ట్ హైబ్రిడీ ఎస్‌యూవీ పేరుతో లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. పాత స్విఫ్ట్ మోడల్‌తో పోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. హ్యాచ్‌బ్యాక్ స్థానంలో ఎస్‌యూవీగా అప్‌గ్రేడ్ అయింది. ఇక ఇంజన్ కూడా హైబ్రిడ్ ఇంజన్‌తో ఊహించని భారీ మైలేజ్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఇంటీరియర్, ఎక్స్‌టీరియల్ రెండింట్లోనూ చాలా మార్పులు కన్పిస్తాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ ఉంది. మారుతి సుజుకిలో ఎస్‌యూవీలు ఉన్నా సరే..సుజుకి స్విఫ్ట్‌కు కొత్త హైబ్రిడ్ ఇంజన్ జోడించి సరికొత్త ఎస్‌యూవీగా లాంచ్ చేస్తోంది కంపెనీ. కారణం మారుతి సుజుకి కార్లతో స్విఫ్ట్ కారుకు ఉన్న క్రేజ్. మారుతి సుజుకి స్విఫ్ట్‌కు ఇప్పటికే అదే క్రేజ్ ఉంది. అందుకే న్యూ స్విఫ్ట్ హైబ్రిడ్ పేరుతో ఎస్‌యూవీ లాంచ్ చేస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కారు మైలేజ్. అందర్నీ ఇదే ఆకర్షించనుంది. ఏకంగా 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఎస్‌యూవీ మార్కెట్‌లో కచ్చితంగా ఇది పెను సంచలనం కాగలదు. ఎందుకంటే ఎస్‌యూవీల్లో ఇంత భారీ మైలేజ్ ఇచ్చే కారు ఇప్పటి వరకూ లేనేలేదు. 

మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో పవర్ ఫుల్ 1.2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. మైలేజ్ లీటర్‌కు 40 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. వినూత్నమైన హైబ్రిడ్ టెక్నాలజీ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ కారులో అప్‌డేటెడ్ ఫ్రంట్ బంపర్, బ్లాక్ అవుట్ పిల్లర్, వీర్ ఆర్చ్, ఫాక్స్ ఎయిర్‌వెంట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర 10 లక్షల రూపాయలతో ఉండవచ్చని తెలుస్తోంది. ఎస్‌యూవీ విభాగంలో ఇదే అత్యంత చౌక కారుగా ఉండాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. 

Also read: Bank Holidays: దసరా ఫెస్టివల్ సందడి.. బ్యాంకులకు హాలీ డే ఎప్పుడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News