ITR Download Process: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అనేది చాలా కీలకం. ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్యమైంది. ఐటీ రిటర్న్స్ అనేది చాలా అంశాల్లో ఉపయోగపడుతుంది. లోన్ అప్లై చేసేటప్పుడు, విదేశాలకు వెళ్లేటప్పుడు వీసా కోసం ఇలా అన్నింట్లో ఐటీ రిటర్న్స్ అవసరమే. కొన్ని సంస్థలయితే గత మూడేళ్ల రిటర్న్స్ అడుగుతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటీ రిటర్న్స్ ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తుంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ పత్రాల్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ల మంజూరు సమయంలో విధిగా అడుగుతున్నారు. విదేశాలకు వెళ్లేవారికైతే వీసా కోసం ఇవి తప్పనిసరి. చాలావరకూ గత మూడేళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతుంటారు. సాఫ్ట్ కాపీ లేకపోతే ఏం చేయాలనే సమస్య ఎదురౌతుంది. అయితే ఐటీ రిటర్న్స్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో కూర్చుని సులభంగా తాజాగా ఫైల్ చేసినవే కాకుండా గత మూడేళ్లవి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.


ముందుగా ఇన్‌కంటాక్స్ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పాన్‌కార్డుతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తరువాత e file క్లిక్ చేసి Income tax returnsలో వెళ్లాలి. ఆ తరువాత వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడక్కడ ఈ ఏడాది అంటే 2023-24తో పాటు 2022-23, 2021-22 ఐటీ రిటర్న్స్ ఒకదాని కింద ఒకటి కన్పిస్తాయి. అందులో మీక్కావల్సిన ఏడాది రిటర్న్స్ పక్కన కన్పించే డౌన్‌లోడ్ ఫామ్ క్లిక్ చేస్తే క్షణాల్లో మీ ముందుంటుంది. 


Also read: NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వ్యవహారంలో కీలక పరిణామం, మాల్ ప్రాక్టీసుపై కేంద్రం నివేదిక, ఏం జరగనుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook