EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఖాతాదారులు EPF Balance వివరాలు తెలుసుకోవచ్చు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
EPF Balance: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఈపీఎఫ్ ఖాతాలలో నగదు నిల్వలలపై వడ్డీ రేట్లు తగ్గిస్తారని ప్రచారం జరిగింది. 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఓ ఇటీవల శుభవార్త అందించాయి. వడ్డీ రేట్లు 8.5 శాతంగానే ఉంచుతున్నాయని, తగ్గించడం లేదని ఇటీవల స్పష్టత ఇచ్చారు. తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉంది, పింఛన్ కిందకి ఎంత నగదు ప్రతి నెలా జమ అవుతుందో తెలుసుకోవాలని భావిస్తారు.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి
ఒకవేళ ఈపీఎఫ్(EPF) ఖాతాదారులు ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించడం తెలియకపోయినా, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలోనూ సులువుగా PF ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ మరియు చివరగా పీఎఫ్ ఖాతాలోకి ఎంత నగదు జమ చేశారన్న వివరాలు సైతం తెలుసుకునే అవకావాన్ని ఈపీఎఫ్‌వో(EPFO) కల్పించింది. 011-22901406 కు మిస్డ్ కాల్(EPF Balance Number) ఇస్తే ఈపీఎఫ్ ఖాతా వివరాలు రిజస్టర్ అయిన మీ ఫోన్‌కు అందుతాయి.
Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన సదరు ఉద్యోగి యూఏఎన్ నెంబర్, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు పీఎఫ్ ఖాతాలోని నగదు వివరాలు మెస్సేజ్ రూపంలో అందుతాయి. అయితే పీఎఫ్(Provident Fund) ఖాతాదారులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో తమ యూఏఎన్ నెంబర్‌కు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్(Aadhar Number), పాన్ నెంబర్లలో ఏదైనా ఒకదాని వివరాలు అప్‌డేట్ చేసిన వారికి పీఎఫ్ బ్యాలెన్స్(PF Balance)తో పాటు చివరగా ఎంత మేర నగదు పీఎఫ్ ఖాతాకు జమ చేసిన వివరాలు అందుతాయి.
Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook