Stock Market : స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం అనేది ఒక కళ అనే చెప్పాలి. నిజానికి మార్కెట్ ట్రెండును ఒడిసి పట్టి సరైన స్టాక్స్ ఎంచుకుంటే లాటరీ టికెట్ కన్నా తక్కువ ఏమీ కాదని చాలామంది నిరూపించారు. మీ అదృష్టం బాగుంటే మీరు పెట్టిన చిన్న పెట్టుబడులతోనే కోటీశ్వరులుగా చేసే స్టాక్స్ కూడా ఈక్విటీ మార్కెట్లలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదాహరణకు MRF షేర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో బాహుబలి రిటర్న్స్ ఇచ్చాయని నిపుణులు చెబుతూ ఉంటారు. దేశంలోనే టాప్ టైర్ కంపెనీలో ఒకటైన MRF కంపెనీ 1990లో ఈ షేర్ విలువ కేవలం 350 రూపాయలు మాత్రమే ఉంది. కానీ 2024 ఫిబ్రవరిలో ఈ షేర్ ఆల్ టైం గరిష్ట స్థాయి 1.50 లక్షల రూపాయల వరకు పెరిగింది. అంటే 1990లో 350 రూపాయల చొప్పున 100 షేర్లను కొనుగోలు చేసి ఉంటే మీకు 35 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. అదే షేరు ఇప్పుడు లక్షన్నర వరకు పెరిగింది అంటే దాదాపు మీ వద్ద ప్రస్తుతం కోటిన్నర రూపాయల విలువైన షేర్లు మీ వద్ద ఉండేవి దీనిబట్టి మీరు షేర్ మార్కెట్లో ఉన్న మ్యాజిక్ ను అర్థం చేసుకోవచ్చు.


తాజాగా ఇప్పుడు బెంగళూరుకు చెందిన ప్రియా శర్మ ఇలాంటి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు 2004వ సంవత్సరంలో ప్రియా శర్మ తాతగారు ఎల్ అండ్ టి 500 షేర్లను కొనుగోలు చేశారు అయితే ప్రస్తుతం ఈ షేర్లు బోనస్ షేర్లు అలాగే స్టాకుల విభజన ఇలా అనేక పరిణామాల ఫలితంగా ఈ షేర్లు 4500 షేర్లుగా మారాయి అయితే ప్రియా తాతగారు ఈ షేర్లను కొనుగోలు చేసి ఆ తర్వాత ఆయన మరణించారు అయితే ఈ షేర్ల సంఖ్య ప్రస్తుతం 9 రెట్లు పెరిగింది. ఎలాంటి షేరు 2004లో 50 రూపాయల వద్ద ఉంది. అంటే ప్రియ తాతగారు 50 రూపాయల చొప్పున 500 షేర్లు కొనుగోలు చేశారు. 


Also Read:Mukesh Ambani: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వాడుతున్నఫోన్ ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!


ఇందులో ఆయన 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ షేర్లు ప్రస్తుతం 4500 షేర్లుగా మారగా, ఒక్క షేరు విలువ ప్రస్తుతం 3,632 రూపాయలుగా ఉంది. అంటే వీటి విలువ సుమారు 1.63 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రియ తాత గారు ఈ షేర్లను కొనగులో చేసి మర్చిపోయారు. ఆయన తదనంతరం ప్రియ 2020లో కోవిడ్ కాలంలో ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేయాలో తోచక, ఇల్లు సర్దుతుంటే ఓ పాత ట్రంకు పెట్టెలో ఈ షేర్లకు సంబంధించిన కాగితాలు బయటపడ్డాయి. 


వీటిని తాను క్లెయిం చేసుకునేందుకు ప్రియ ఎల్ అండ్ టీ వద్దకు వెళ్లగా, ప్రియ పేరిట పత్రాలు బదిలీ చేయడానికి రూల్స్ అడ్డంగా మారాయి. దీంతో వారసత్వపు హక్కుల విషయంలో ప్రియ దాదాపు చాలా కాలం పాటు కఠినమైన ప్రాసెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఆమె తన వారసత్వాన్ని నిరూపించుకోవడంతో ఆమెకు ఈ కోట్ల రూపాయల ధనం చేతికి చిక్కి కోటీశ్వరురాలైంది.


Also Read:LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం..ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!


Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter