EPF Transfer Online | ​ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులకు పలు సేవల్ని అందిస్తోంది. ఉద్యోగులకు భవిష్య నిధిగా పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఇంటి కోసం రుణాలు చేయాలన్నా, పెళ్లి, ఆరోగ్య, తదితర ఖర్చులకు సైతం మీరు EPF ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. పాత కంపెనీలు మాజీ ఉద్యోగికి వివరాలు సరిగా అందించవు. మరియు ఈపీఎఫ్‌వో నగదును కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే సదుపాయాన్ని తమ ఖాతాదారులకు EPFO కల్పించింది. 


Also Read: EPFO: EPF ఖాతాదారులు హోమ్ లోన్, Personal Loan ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి


ఈపీఎఫ్ ఖాతా నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (Universal Account Number), ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మీ వద్ద ఉండాలి. అదే విధంగా మీ ఆధార్ నెంబర్‌ను మీ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి. బ్యాంక్ వివరాలు సైతం అప్‌డేట్ చేసి ఉండాలి. పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేసుకునే విధానం ఇక్కడ తెలియజేస్తున్నాం. 


Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మిస్డ్ కాల్ ద్వారా EPF Balance వివరాలు పొందవచ్చని తెలుసా


ఈపీఎఫ్ నగదు బదిలీ చేసుకునే విధానం (How to Transfer EPF Online)
- మొదటగా ఈపీఎఫ్ ఖాతాదారుడు EPFO వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు లాగిన్ అవ్వాలి


- అందులో Online Services ఆప్షన్‌కు వెళ్లి ఆపై One Member - One EPF Account మీద క్లిక్ చేయాలి


- ప్రస్తుత సంస్థలో ఉద్యోగం సహా వ్యక్తిగత వివరాలు ధ్రువీకరించుకోవాలి. Get details ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని ద్వారా పాత కంపెనీలో మీ పీఎఫ్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. 


- అందులో పాత కంపెనీ లేదా ప్రస్తుత కంపెనీ అటెస్టింగ్ ఫామ్ కనిపిస్తుంది.  Get OTP మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి, ఆపై సబ్మిట్ చేస్తే PF Transfer ప్రక్రియ పూర్తవుతుంది.  


- మీకు ఇంకా వివరాలు అర్థం కాకపోతే ఈ ఫొటోలో చూపినట్లుగా పాటిస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త కంపెనీ పీఎఫ్ అకౌంట్‌కు కొన్ని రోజుల్లో బదిలీ అవుతాయి. 


Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook