Aadhaar Update: ఆధార్​.. ప్రతి భారతీయుడుకి తప్పనిసరి గుర్తింపు కార్డు. 12 అంకెలతో కూడిన ఈ కార్డ్​ గుర్తింపు కార్డుగానే కాకుండా.. చాలా అవసరాలకు ఇది అవసరం. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు అందించే చాలా సేవలు వినియోగించుకోవాలంటే.. ఆధార్ తప్పనిసరి. అందుకే ఎప్పటికప్పుడు ఆధార్​ అప్​డేటెడ్​గా ఉండటం అవసరం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేరు అనేది మళ్లీ మళ్లీ మార్చుకోదు కాబట్టి. అలాంటివి పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఫొటో, అడ్రస్​ వంటివి మారే వారు మాత్రం ఆధార్​ను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది.


ముఖ్యంగా ఆధార్​ ఫొటోల విషయంలో మార్పులు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆధార్​లో ఫొటో పాతది ఉంటే ఇబ్బందులు తలెత్తొచ్చని చాలా మంది భావిస్తుంటారు. అంలానే మీకూ అనిపిస్తుంటే.. సులభంగా మీరు ఆధార్​లో ఫొటోను మార్చుకోవచ్చు.


ఆధార్​లో ఫొటో మార్చడం ఎలా?


  • ఆధార్​లో ఫొటో ఛేంజ చేయాలంటే.. ముందుగా ఆధార్​ పర్మినెంట్ ఎన్​రోల్​మెంట సెంటర్​ను సంప్రదించాలి.

  • ఆధార్ సెంటర్​లో ఎన్​రోల్​మెంట్ ఫారం తీసుకోవాలి. లేదా ముందుగానే యూఐడీఏఐ వెబ్​సైట్లో ఈ ఫారంను డౌన్​లోడ్ చేసుకునే వీలుంది.

  • ఈ ఫారంలో ముఖ్యమైన అన్ని వివరాలను నింపాలి.

  • ఆ ఫారంను ఆధార్ సిబ్బందికి ఇస్తే.. మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్​ తీసుకుంటారు.

  • బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత.. ఆధార్​ సిబ్బంది మీ కొత్త ఫొటోను తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయితే మీ ఆధార్​కార్డులో పొటో ఛేంజ్ అయిపోతుంది. కొత్త ఫొటో ఉన్న కార్డ్​.. వారం రోజుల్లో పోస్ట్​ ద్వారా వస్తుంది.

  • ఫొటోను మార్చేందుకు గానూ రూ.100 ఛార్జీ వసూలు చేస్తుంది ఆధార్​.

  • అయితే ఆధార్​లో ఫొటో ఛేంజ్ అయ్యిందా లేదా విషయాన్ని తెలుసుకునేందుకు మీకు ఓ అప్​డేట్​ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్​) వస్తుంది. దీనిని ఉపయోగించి మీ రిక్వెస్ట్ స్టెటస్​ను తెలుసుకోవచ్చు.


Also read: Smart TV Offers: రూ.7,749 ధరకే 42 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!


Also read: SBI FD Rates: ఎస్​బీఐ గుడ్​ న్యూస్- భారీగా పెరిగిన ఎఫ్​డీ రేట్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook