హైదరాబాద్‌లో మంచి జోరు మీదున్న రియల్ ఎస్టేట్ రంగం .
Affordable house తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ దశ తిరిగిపోయింది. అప్పటి నుంచి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న రియల్ ఎస్టేర్ ధరలు ఇప్పుడు మరింత వృద్ధి నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలు హైదరాబాద్‌కు వరుస కట్టడంతో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంది. దీంతో కిందటి సంవత్సరం దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రాపర్టీ ధరలు ఐదు శాతం పెరిగాయి. కిందటి ఏడాది మొదటి త్రైమాసికంలో చ.అ.కు రూ.4,240గా ఉండగా.. ఇప్పుడు అది రూ.4,450లకు ఎగబాకింది. ధరల పెరుగుదలలో ఘనణీయమైన వృద్ధి నమోదు అవుతుండడంతో పెట్టుబడిదారులు, డెవలపర్లతో పాటు కొనుగోలు దారులు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.హైదరాబాద్‌లో నానాటికీ మౌలిక సదుపాయాలు మెరుగవడం...నైపుణ్యమైన సేవలు అందడంతో చాలా మంది ఇక్కడే సెటిల్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్నఇళ్లు కిందటి ఏడాది మొదటి త్రైమాసికం 53 నెలలుగా ఉండగా.. ఇప్పుడు అది 27 నెలలకు తగ్గిపోయింది.
ఇక కిందటి ఏడాది హైదరాబాద్‌లో 25,400 ఇళ్లు అమ్ముడు అయినట్లు రికార్డుల్లో నమోదు అయింది. ఇది అంతకు ముందు సంవత్సరంలో పోల్చితే 197 శాతం వృద్ధి నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు హౌజింగ్ లోన్స్ ఇవ్వడం,డెవలపర్లు రాయితీలు ఇవ్వడం ప్రధాన కారణమని తెలుస్తోంది.లాంచింగ్స్‌లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 24 శాతం వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఎప్పటి లాగే లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్ మొదటి వరుసలో నిలవగా....నార్త్ హైదరాబాద్, తూర్పు, క్షిణ హైదరాబాద్ ప్రాంతాలు తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. ముఖ్యంగా అమ్ముడు అవుతున్న గృహాల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్న హై ఎండ్ గృహాలే 50 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఇక ఆతర్వాత క్రమంలో రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఇళ్లు అమ్ముడుతు అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగిత కుటుంబాలకు తగిన ఇళ్ల నిర్మాణంపై రియల్టర్లు ఎక్కువ దృష్టి పెట్టారు.
also read Apple Payments Process: ఇండియాలో యాపిల్ పేమెంట్లకు బ్రేక్, మరి యాప్ పేమెంట్లు ఎలా చేయాలి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.