Hyundai Launched Hyundai Casper SUV with 7 Air Bags and ADAS Features: ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' త్వరలో చౌకైన ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ కారు పేరు 'హ్యుందాయ్ ఎక్స్‌టర్'. గ్లోబల్ మార్కెట్‌లో విక్రయించే 'హ్యుందాయ్ క్యాస్పర్' ఆధారంగా ఇది ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీ హ్యుందాయ్ క్యాస్పర్‌ను గ్లోబల్ మార్కెట్‌లో కొత్త అవతార్‌లో రిలీజ్ చేసింది. కొత్త కలర్ ఆప్షన్‌లను జోడించడంతో పాటు, చవకైన వేరియంట్ కూడా పరిచయం చేయబడింది. కొత్త వేరియంట్‌తో ఈ కారు ఇప్పుడు మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు కార్గో వెర్షన్‌ను కూడా హ్యుందాయ్ కంపెనీ తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హ్యుందాయ్ క్యాస్పర్ కంపెనీ యొక్క అతిచిన్న ఎస్‌యూవీ. దీని పొడవు 3595 మిమీ. అందువలన ప్రపంచ మార్కెట్లో ఈ కారు పొడవు 3600 మిమీ కంటే తక్కువ కేటగిరీ కిందకు వస్తుంది. కాబట్టి ఈ కారు వివిధ పన్ను ప్రయోజనాలను పొందుతుంది. హ్యుందాయ్ కంపెనీ ఈ కారు యొక్క కొత్త వేరియంట్‌లో చాలా ఫీచర్లను ఆడ్ చేసింది. వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, హీటెడ్ ఫ్రంట్ సీట్, పుష్ బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ మరియు లెదర్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 


హ్యుందాయ్ కాస్పర్ యొక్క కొత్త వేరియంట్ ప్రారంభ ధర KRW 14,900,000. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 9.08 లక్షలు. బేస్-స్పెక్ కాస్పర్ ధర KRW 13,850,000 ( భారత కరెన్సీలో దాదాపు రూ. 8.44 లక్షలు). కారు యొక్క ఎసెన్షియల్ ట్రిమ్ 8-అంగుళాల నావిగేషన్ స్క్రీన్, బ్యాక్ మానిటర్, హై పాస్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. కాస్పర్ ఎసెన్షియల్ ట్రిమ్ ధర KRW 16,900,000 ( భారత కరెన్సీలో రూ. 10.30 లక్షలు). 


హ్యుందాయ్ కాస్పర్ కారు యొక్క టాప్ వేరియంట్‌లో మొదటి వరుసలో పూర్తి మడత సీట్లు, రెండవ వరుసలో స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ సీట్లు ఉంటాయి. బ్లైండ్ స్పాట్ కొలిషన్, వెనుక క్రాస్ ట్రాఫిక్ కొలిషన్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ADAS ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్ కాస్పర్ కారు చుడానికి చాలా బాగుంది. తక్కువ ధరలో హ్యుందాయ్ కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. 


Also Read: Flipkart Realme C30 Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 549కే రియల్‌మీ సూపర్ స్మార్ట్‌ఫోన్!   


Also Read: Best Smartphones Under 25000: 25 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. డిజైన్, లుకింగ్ సూపర్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.