Paying Rent On ICICI bank Credit Cards: క్రెడిట్ కార్డు అంటే ఒకప్పుడు అత్యవసరంలో క్రెడిట్ కోసం మాత్రమే ఉపయోగించే వారు. కానీ రాన్రాను పరిస్థితులు మారిపోతుండటం, అవసరాలు పెరిగిపోతుండటంతో క్రెడిట్ కార్డు ఉపయోగించే తీరు కూడా మారిపోయింది. కిరాణ దుకాణంలో, షాపింగ్ మాల్లో గ్రాసరీస్ కొనడం నుండి సినిమా థియేటర్లో టికెట్స్ కొనడం, ఆన్లైన్లో ట్రెయిన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, నచ్చిన దుస్తులు కొనడం, రెస్టారెంట్లో బిల్లు చెల్లింపులు.. ఇలా ఎన్నో అవసరాలకు క్రెడిట్ కార్డు పెద్ద దిక్కవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్నింటికి మించి క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు అనేక ఇతర అవసరాలపై ఆఫర్లు గుప్పిస్తుండటంతో క్రెడిట్ కార్డు వినియోగం కూడా విస్తృత స్థాయిలో పెరిగిపోయిందన్న మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అలా క్రెడిట్ కార్డు పేమెంట్స్ సేవల్లో యాడ్ అయిన సర్వీసుల్లో రెంట్ పేమెంట్ కూడా ఒకటి. అవును.. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించి రెంట్ కూడా చెల్లించుకునేందుకు బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీంతో చాలామంది క్రెడిట్ కార్డులు ఉపయోగించి రెంట్ పేమెంట్ పేరుతో తమ ఇతరత్రా అవసరాలు కూడా వెళ్లదీసుకుంటున్నారు.


ఐసిఐసిఐ క్రిడెట్ కార్డు హోల్డర్స్‌కి అలర్ట్
ఐసిఐసిఐ బ్యాంకు క్రిడెట్ కార్డు హోల్డర్స్‌కి ఒక ముఖ్యమైన అలర్ట్. ఇప్పటివరకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా రెంట్ చెల్లించిన వారికి ఇకపై ఆ అవకాశం లేదు. అవును.. ఐసిఐసిఐ బ్యాంకు ప్రకటించిన వివరాల ప్రకారం త్వరలోనే ఆ క్రెడిట్ కార్డు ఉపయోగించి రెంట్ చెల్లించే వారు ఆ లావాదేవీలపై 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన వర్తించనుంది. తాజాగా మెస్సేజుల రూపంలో ఐసీఐసీఐ బ్యాంకు ఈ వివరాలను క్రెడిట్ కార్డు వినియోగదారులకు తెలియజేసింది.


క్రెడిట్ కార్డు పేమెంట్స్.. వడ్డీ వడ్డన లేకుండా..
క్రెడిట్ కార్డు హోల్డర్స్ క్రెడిట్ తీసుకునే అవసరం ఏదైనా.. నిర్ధిష్టమైన తేదీలోగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. ఒకవేళ నిర్ధిష్టమైన గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతేనే క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కి అసలు చిక్కొచ్చిపడేది. క్రెడిట్ కార్డు ఉపయోగించినందుకు బిల్లుపై వడ్డీ, లేట్ ఫీజు చార్జీలు, ఫైనాన్షియల్ చార్జీలు, జీఎస్టీ అంటూ ఏవేవో చార్జీలు కలిపి భారీ మొత్తంలో బిల్లు విధించి కస్టమర్స్‌కి పట్టపగలే చుక్కలు చూపిస్తారు. అందుకే క్రెడిట్ కార్డు బిల్ డేట్ గడువు లోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోయినట్టయితే.. ఎంతో తప్పనిసరి అవసరమైతే తప్పించి క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోవడమే బెటర్ అనేది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇచ్చే సలహా.


Also Read : Online Shopping: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అత్యంత చౌకగా షాపింగ్, త్వరపడండి మరి


Also Read : Flipkart Big Billion Days 2022: 40 అంగుళాల టీవీ కేవలం రూ. 2,499కే.. కేవలం పరిమిత కాల ఆఫర్‌ మాత్రమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి