Bank Account Nominee: నామినీ పేరు చేర్చకుండా ఖాతాదారుడు మరణిస్తే.. బ్యాంకు అకౌంటులో డబ్బులు ఎవరికి చెందుతాయి?
Bank Account Nominee: సాధారణంగా బ్యాంకుల్లో నామిని గురించి చాలామంది పట్టించుకోరు. కానీ ప్రతి అకౌంటుదారుడు నామినీని ప్రకటించడం వల్ల పలు రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. నామినీని ఉంచడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
Nominee: బ్యాంకు అకౌంటు, డిమాట్ అకౌంట్, ఎల్ఐసి పాలసీ, ఆస్తులు, బాండ్లు, షేర్లు ఇలా ఎలాంటి ఆర్థిక లావాదేవీ కైనా సరే.. నామినీ చేర్చడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు నామినీని లేకపోతే, అతని మరణం తర్వాత, డబ్బు ఎవరికి జమ చెందుతుందనేది ధర్మ సందేహంగా మారుతుంది. నిజానికి ఏదైన అకౌంటు ఖాతాదారుడు మరణిస్తే, డిపాజిట్ చేసిన డబ్బు నామినీకి లభిస్తుంది. ఖాతాదారుడు మరణిస్తే, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతను చేసిన నామినీకి అందుతుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేసినట్లయితే, ఆ నామినీలందరికీ సమాన మొత్తం అందించవచ్చు. అనేక బ్యాంకులు అటువంటి సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. దీనిలో మీరు ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేయవచ్చు. మరణం తర్వాత ఏ వ్యక్తికి ఎంత వాటా ఇవ్వాలో కూడా పేర్కొనవచ్చు.
నామినీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి:
ఉదాహరణకు, ఒక వ్యక్తి తన భార్య, తల్లి, సోదరిని తన బ్యాంకు ఖాతాకు నామినీగా చేశాడు. ఏ కారణం చేతనైనా ఆ వ్యక్తి చనిపోతే అతని బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బు మొత్తం అతని భార్య, తల్లి, సోదరికి సమానంగా పంచుతారు. మరో ఉదాహరణలో ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా కోసం 3 మందిని నామినీలుగా కూడా చేసాడు. అయితే నామినేషన్ వేసేటప్పుడు, ఆ వ్యక్తి మరణించిన తర్వాత, తన ఖాతాలో జమ చేసిన డబ్బులో 50 శాతం తన భార్యకు ఇవ్వాలని 25-25 శాతం తన తల్లి సోదరికి ఇవ్వాలని పేర్కొన్నాడు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి చనిపోతే, అతని ఖాతాలో జమ చేసిన డబ్బులో 50 శాతం అతని భార్యకు, 25-25 శాతం అతని తల్లి సోదరికి లభిస్తుంది.
నామినీ లేకపోతే, ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది?
ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాకు ఎవరినీ నామినీ చేయనట్లయితే, అతని మరణం తర్వాత, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతని చట్టబద్ధమైన వారసునికి అందుతుంది. వివాహిత వ్యక్తి చట్టపరమైన వారసులు అతని భార్య, పిల్లలు తల్లిదండ్రులు. మరణించిన ఖాతాదారు అవివాహితుడు అయితే, అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అతని చట్టపరమైన వారసుడిగా క్లెయిమ్ చేయవచ్చు. ఒకవేళ నామినీ చేయని పక్షంలో, చాలా రకాల డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి.
డబ్బు ఎలా పొందాలి?
ఖాతాదారుడు మరణించి, అతని బ్యాంకు ఖాతాకు నామినీని చేయకుంటే, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతని చట్టబద్ధమైన వారసుడికి చెందుతుంది. ఇందుకోసం చట్టబద్ధమైన వారసుడు కొన్ని ముఖ్యమైన పత్రాలతో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు మరణించిన ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రం, చట్టపరమైన వారసుడి ఫోటో, KYC సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.