Vande Bharat trains: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల మోత మోగించనుంది. ఇప్పటికే ఢిల్లీ తరువాత అత్యధిక వందే భారత్ సర్వీసులు నడుస్తున్న స్టేషన్ గా సికింద్రాబాద్ పేరు సంపాదించుకోగా, తాజాగా సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య మరో వందే భారత్ పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. అలాగే దుర్గ్ - విశాఖ రూట్లో కూడా ఈ నెల 16న ప్రధాని మోదీ చేతుల మీదుగా వందే భారత్ ప్రారంభోత్సవం కానుంది.
Vande Bharat trains: తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బంపర్ బోనాంజ ఆఫర్ అందించింది. వినాయక నవరాత్రుల సందర్భంగా సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభం కానుంది. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 4 భారత్ రైళ్లు సేవలు అందిస్తుండగా తాజాగా ఐదవ వందే భారత్ రైలు కూడా తన సేవలను ప్రారంభించింది. ఇక విశాఖ పట్నం నుంచి ఛత్తీస్ గడ్ లోని దుర్గ్ స్టేషన్ల మధ్యలో కూడా మరో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కొత్త వందే భారత్ రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ - హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్టణం మధ్య ఈ కొత్త సర్వీసులు నడవనున్నాయి.
ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సర్వీసు అందిస్తున్నాయి. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా రైల్వే శాఖ కేటాయించింది. నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాగా, సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేటలో ఆగుతుంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు పెద్ద మొత్తంలో రూ.5,336 కోట్ల నిధులు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాదు తెలంగాణలో మొత్తం 40 స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించనున్నట్లు కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇక మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ దుర్గ్-విశాఖపట్నం మార్గంలో నడవనుంది. దీంతో విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు భారీ కానుక లభించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌లను కలిగి ఉంది. రైల్వేశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ రైలు దుర్గ్ నుంచి విశాఖపట్నం వెళ్లనుంది. ఈ రైలు దుర్గ్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి 7.18 గంటలకు మహాసముంద్ చేరుకుంటుంది. ఈ రైలు 7.20కి బయలుదేరుతుంది. ఈ రైలు 566 కిలోమీటర్ల ప్రయాణాన్ని 8 గంటల్లో పూర్తి చేస్తుంది.
విశాఖపట్నం నుంచి దుర్గ్ వైపు వెళ్లే రైలు 21.20కి మహాసముంద్‌కు చేరుకుని 21.25కి రాయ్‌పూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ప్రారంభంతో, మహాసముంద్ ఒడిశాలోని కొన్ని నగరాలతో కనెక్టివిటీని పొందుతుంది. ఇది దుర్గ్, రాయ్‌పూర్, మహాసముంద్, టిట్‌లగడ్, రాయ్‌గఢ్, విజయనగరం, విశాఖపట్నంలో ఆగుతుంది. అయితే వివిధ మార్గాల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందన్న సమాచారం తెలియాల్సి ఉంది.