ITR Filing Last Date: మీరు 31 డిసెంబర్ 2022 నాటికి ఆదాయపు పన్ను రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దలేకపోయారా..? ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా..? మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీకు మరో అవకాశం ఉంది. మీరు ITR-U ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (1) ప్రకారం.. 2021-22 సంవత్సరంలో ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. ఈ తేదీ వరకు ఐటీఆర్ ఫైల్ చేయలేని వారికి డిసెంబర్ 31 చివరి తేదీ. రిటర్నులలో ఏదైనా పొరపాటు లేదా దిద్దుబాటు ఉంటే.. అది కూడా ఈ తేదీలోపు చేయవచ్చు. కానీ మీరు డిసెంబర్ 31వ తేదీ కూడా గడువును మిస్ చేసుకుని ఉంటే.. మీరు సెక్షన్ 139 (8A) కింద ITR-U ఫైల్ చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ITR-U అంటే..


2022 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ITR-U ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ సదుపాయం వారి ITR ఫైల్ చేయలేని లేదా మునుపటి రిటర్న్‌లలో తప్పులు చేసిన పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ITR-U ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ITRలో తప్పులు లేదా లోపాలను సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాల వరకు సరిచేయవచ్చు. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరంలో మీరు ITR-Uని 31 మార్చి 2024లోపు ఫైల్ చేయవచ్చు. అదేవిధంగా 2022-23 ఏడాది కోసం మీరు 31 మార్చి 2025 వరకు ITR-U ఫైల్ చేయవచ్చు. 


ITR-Uలో మీరు మీ మునుపటి రిటర్న్‌లో చూపలేని ఆదాయాన్ని చూపించవచ్చు. అంతేకాకుండా ఈ సదుపాయం ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. ఆలస్యంగా లేదా సవరించిన ITRని దాఖలు చేసినా.. చేయకపోయినా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోయి ఉంటే ITR-U ఉపయోగించవచ్చు. 


ITR-U ఫైల్ చేయడానికి చివరి తేదీలు


అసెస్‌మెంట్  ఇయర్ 2020-21: 31 మార్చి 2023
అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 : 31 మార్చి 2024 
అసెస్‌మెంట్ ఇయర్ 2022-23: 31 మార్చి 2025


ITR-U ఫైల్ చేయనందుకు జరిమానా


మీరు ITR-U ఫైల్ చేయనందుకు జరిమానా కూడా చెల్లించాలి. మీరు ఏదైనా ఆదాయాన్ని చూపించడం మర్చిపోయినట్లయితే.. మీరు దానిపై చెల్లించాల్సిన పన్ను, వడ్డీలో అదనంగా 25 శాతం చెల్లించాలి. ఇది ఆ ఆర్థిక సంవత్సరం చివరి నుంచి ఒక సంవత్సరంలోపు చేయాలి. మీరు సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఒక సంవత్సరం తర్వాత రెండేళ్లలోపు ITR-Uని ఫైల్ చేస్తే.. అప్పుడు జరిమానా 50 శాతానికి చేరుకుంటుంది. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ITR-U ఫైల్ చేయాలి.


అయితే పన్ను చెల్లింపుదారులు జీరో రిటర్న్/లాస్ రిటర్న్ ఫైల్ చేయడానికి ITR-Uని ఉపయోగించలేరు. రీఫండ్‌లను క్లెయిమ్ చేయడానికి లేదా పొడిగించడానికి ఇది ఉపయోగించబడదు. అలాగే ఇంతకుముందు దాఖలు చేసిన రిటర్న్‌ల నుంచి ఆదాయపు పన్ను బాధ్యతను సెట్ చేయడానికి ITR-U ఉపయోగించడానికి అనుమతి లేదు.


Also Read: Rohit Shetty Injured: ప్రమాదంలో స్టార్ డైరెక్టర్‌కు గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి !


Also Read: Rishabh Pant's knee surgery: రిషబ్ పంత్ కాలికి శస్త్ర చికిత్స.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook