JOB OFFER కోటీ నలభై లక్షల జీతంతో లండన్ ఆఫీసులో చేరిన ఐఐటీ గ్రాడ్యూయేట్
JOB OFFER ట్యాలెంట్ ఉంటే ఎంత మంచి ఉద్యోగాన్ని అయినా సాధించవచ్చని నేటి యువత నిరూపిస్తోంది. కొంత మంది జీవితాంతం ఎంత నిబద్ధతగా పనిచేసినా రిటర్మెంట్‌కు ముందు కూడా నేటి యంగ్ ట్యాలెంటెడ్ యూత్ డ్రా చేస్తున్న జీతంలో సగానికి సగం కూడా సంపాదించలేకపోతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఏర్పడింది. చాలా మంది ఉన్నత విద్యావంతులు ప్రతీ ఏటా పుట్టుకొస్తున్న వారిలో మల్టీ ట్యాలెంట్ కరువు అవుతోంది. దీంతో సంస్థ అవసరాలను అన్ని విధాలుగా తీర్చే వారి కోసం మల్టీనేషనల్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఇందుకోసం ఎంత జీతం ఇచ్చేందుకు అయినా వెనుకాడడం లేదు. ఈక్రమంలో ప్రతీ ఏటా కొంత మందికి కోట్లాది రూపాయల జీతం వస్తోంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలహాబాద్ విద్యార్ధికి గూగుల్ ఏకంగా 1.4 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. అంటే నెలకు 11.6 లక్షల జీతానికి ప్రకాష్ గుప్తాకు టెక్ దిగ్గజం గుగుల్‌లో చేరాడు. 2022 ఎంటెక్ బ్యాచ్ నూరు శాతం ప్లేస్‌మెంట్ మార్క్‌ను సాధించింది ఐఐఐటీ అలహాబాద్. ఏడాదికి కోటి నలభై లక్షల భారీ జీంతో ప్రకాష్ గుప్తా గూగుల్ లండన్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. కిందటి ఏడాది ఎంటెక్ పూర్తి చేసుకున్న తర్వాతే ఇంత మంచి ఉద్యోగం దొరకడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈవిషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఇతనితో పాటు ఐఐఐటీ అలహాబాద్ ఎంటెక్ బ్యాచ్‌లో మరికొంత మందికి కూడా ఇవే విధంగా భారీ ప్యాకేజీలతో ఉద్యోగం సంపాదించారు. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజ సంస్థల నుంచి వీరికి ఆఫర్లు వచ్చాయి.
ALSO READ Aadhaar Pan Link: జూలై 1లోపు పాన్-ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకోండి... లేదంటే మీకే నష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook