Income Tax Benefits: ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, ఈ Post Office స్కీమ్‌లో చేరండి
Income Tax Benefit Scheme : సంపాదించిన నగదు ఐటీ శాఖ తెలిపిన స్లాబ్‌లలో ఉంటే అందుకు తగ్గట్లుగా ఆదాయ పన్ను చెల్లించాలి. లేనిపక్షంలో అందుకు జరిమానా, తదితర చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆదాయ పన్నులో సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందుతారు.
Income Tax Benefits: ఉద్యోగులు, వ్యాపారులైనా.. ఆదాయ పన్నుశాఖ మార్గదర్శకాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది. వారు సంపాదించిన నగదు ఐటీ శాఖ తెలిపిన స్లాబ్‌లలో ఉంటే అందుకు తగ్గట్లుగా ఆదాయ పన్ను చెల్లించాలి. లేనిపక్షంలో అందుకు జరిమానా, తదితర చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. పోస్టాఫీసు అందిస్తున్న నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ (NSC)లో చేరితే మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో 5.9 శాతం వడ్డీ కూడా మీరు అందిస్తుంది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ (National Saving Certificate Scheme) కింద ఇన్వెస్ట్ చేసిన వారు ఆదాయ పన్నులో సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందుతారు. ఎలాంటి రిస్క్ లేకుండా మీరు ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడులు చేయాలని ఆర్థిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సమస్య తలెత్తిన సందర్భంలో మీరు ఈ స్కీమ్‌లో చేసిన పెట్టుబడి నగదును విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించారు.
Also Read: Home Loan Mistakes: హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే ఈ 5 తప్పిదాలు చేయవద్దు
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ప్రయోజనాలు (Benefits of National Saving Certificate)
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ మెచ్యురిటీ కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఏడాది గడిచిన అనంతరం ఇన్వెస్టర్ తమకు అవసరమైతే నగదును ఉపసంహరించుకునే వీలుంది. కానీ కొన్ని నిబంధనలకు లోబడి వారు మీ నగదును తిరిగి మీకు అందించనున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం వడ్డీని నిర్ణయిస్తుంది.
Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు EPF Balance పూర్తి వివరాలు
ఈ ఎన్‌ఎస్‌సీ స్కీమ్ ద్వారా మీరు 5.9 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. అందులోనూ ఎలాంటి రిస్క్ లేని పథకం కనుక ప్రజలు సైతం తమ డబ్బును వీలైనంతగా ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారు. రూ.1.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ వరకు ఈ స్కీమ్ ద్వారా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే వడ్డీని మాత్రం మెచ్యురిటీ కాలం అంటే 5 ఏళ్లు ముగిసిన తరువాతే మీకు అందుతాయి. ప్రతినెలా రూ.100 నుంచి తమ ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook