Income Tax Refund Status: ఈ ఏడాదికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు జూలై 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారు రీఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది సమయం రీఫండ్‌కు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈసారి కఠినంగా రిటర్న్‌లను పరిశీలించబోతున్నారు. దాఖలు చేసిన ఐటీఆర్‌లను పరిశీలించడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్వీయ ఆటోమెటెడ్, సవరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ (AI)ని ఉపయోగించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రోగ్రామ్ మొదట పాన్ కార్డ్‌తో లింక్ చేసిన డేటాను సేకరిస్తుంది. అనంతరం ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన డేటాను ఆటోమెటిక్‌గా చెక్ చేస్తుంది. ఆ తరువాత ఏఐ మీ ఆధార్, పాన్‌తో లింక్ చేసిన లావాదేవీలను బ్యాంక్ ఖాతాలతో లెక్కిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, క్రెడిట్ చేసిన త్రైమాసిక వడ్డీలు, షేర్ డివిడెండ్‌లు, షేర్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్, షేర్లు, మీరు డిక్లేర్ చేసిన & మీరు ఫైల్ చేసిన మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్‌తో పాటుగా జోడించిన అన్ని బ్యాంక్ అకౌంట్‌ల దీర్ఘకాలిక, స్వల్పకాలిక లాభాల అన్ని వివరాలను సేకరిస్తుంది. మీ పేరుపై, జాయింట్ పేరుపై ప్రకటించని బ్యాంక్ అకౌంట్‌లను కూడా లెక్కిస్తుంది.


ఇది అన్ని సహకార బ్యాంకులు, స్థానిక క్రెడిట్ కంపెనీలు, పోస్టల్ ఫిక్స్ డిపాజిట్లు, వడ్డీలు, పోస్టల్ ఆర్‌డీలు, MIS, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లు మొదలైన వాటితో కూడిన పోస్టల్ అకౌంట్‌లు, బ్యాంక్ అకౌంట్‌లను మీరు ఇన్వెస్ట్ చేసిన చోట సింగిల్ లేదా రెండవ పేరుతో సెర్చ్ చేస్తుంది. ప్రస్తుత, మునుపటి మూడేళ్లలో ఏదైనా భూమి, స్థిరాస్తి లావాదేవీల కోసం ఇప్పుడు ప్రభుత్వ రిజిస్ట్రీ కార్యాలయంతో పాన్ కార్డ్‌తో చెక్ చేస్తుంది.


వీటన్నింటి తర్వాత డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీలు, పాస్‌పోర్ట్, వీసా అటాచ్డ్ టూర్ వివరాలు, టూ & ఫోర్ వీలర్ కొనుగోలు లేదా అమ్మకం మొదలైన వాటిని వర్కవుట్ చేస్తారు. సేకరించిన పూర్తి డేటా మీ ఆదాయపు పన్ను రిటర్న్ ద్వారా మీరు అందించిన/ప్రకటించిన డేటాతో సమానంగా ఉంటుంది. AS26 డేటాలో టీడీఎస్‌ కట్‌తో కూడా లెక్కిస్తారు. 


ప్రకటించిన లేదా ప్రకటించని వాస్తవ ఆదాయపు పన్ను ఆటోమెటిక్‌గా లెక్కిస్తుంది. సెక్షన్ 143(i) కింద మీకు డిమాండ్ పంపిస్తుంది. పూర్తి ప్రూఫ్ ఆటోమెటెడ్ AI-ITR ప్రోగ్రామ్ విజయవంతంగా ఖరారు చేస్తుంది. ఈ సంవత్సరం నుంచే మొదటిసారిగా ఏఐను ఉపయోగిస్తున్నారు. అందుకే ఆదాయపు పన్ను ప్రాసెసింగ్ కొంత ఆలస్యం అవుతోంది. అన్ని ఐటీఆర్‌లు జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాసెస్ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ AI-ITR ప్రోగ్రామ్ ఈ పనులన్నింటినీ సెకన్ల వ్యవధిలో పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెబుతున్నారు.


Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం  


Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి