Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి

Offers on Gas Bill Payments in Online: ఆన్‌లైన్‌లో గ్యాస్ బిల్లులు చెల్లింపులపై పలు కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ధరల నుంచి కాస్త ఉపశమనం ఇక్కడ ఇచ్చిన కొన్ని ప్రోమో కోడ్స్‌ను వాడుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2023, 11:44 AM IST
Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి

Offers on Gas Bill Payments in Online: ప్రస్తుతం పెరుగుతున్న గ్యాస్ బిల్లులు చెల్లించేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో వంటింటి బడ్జెట్ కూడా మరింత పెరుగుతుంది. మీరు మీ గ్యాస్‌ బిల్లు చెల్లింపులపై డబ్బు ఆదా చేసుకునే మార్గాల్లో ఆన్‌లైన్‌లో ఉన్నాయి. కొన్ని ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ గ్యాస్ చెల్లింపులపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వీటి ద్వారా మీరు గ్యాస్ బిల్లులు చెల్లించి పెరిగిన ధరలను కాస్త ఉపశమనం పొందవచ్చు. 

ఫ్రీఛార్జ్‌తో 20 శాతం ఆఫర్

ఫ్రీఛార్జ్ అనేది మీ బిల్లులు, రీఛార్జ్‌ల కోసం చెల్లించడానికి ఉపయోగించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. గ్యాస్ బిల్లు చెల్లింపు ఆఫర్‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది ఫ్రీఛార్జ్. మీరు మీ మొదటి గ్యాస్ బిల్లు చెల్లింపులో రూ.200 లేదా 20 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ని పొందడానికి మీరు GAS100 కూపన్ కోడ్‌ని ఫ్రీఛార్జ్‌లో యూజ్ చేయండి.

Mobikwikలో క్యాష్‌బ్యాక్ పొందండి

ప్రముఖ డిజిటల్ చెల్లింపు వాలెట్ Mobikwik లో మీ గ్యాస్ బిల్లు చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ ప్రయోజనం పొందడానికి బిల్లు చెల్లింపు చేస్తున్నప్పుడు IGL అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు రూ.25 క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు.

అమెజాన్ పేలో క్యాష్‌బ్యాక్

భారత్ గ్యాస్‌ బుకింగ్‌పై అమెజాన్‌ పేలో క్యాష్‌ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. అమెజాన్ పే వాలెట్ ద్వారా భారత్ గ్యాస్ బిల్లులు చెల్లించేటప్పుడు రూ.35 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

గూగుల్ పేలో బ్రాండ్ వోచర్‌లను పొందండి

గూగుల్ పే ద్వారా గ్యాస్ బిల్లులు చెల్లిస్తే.. ప్రత్యేకమైన బ్రాండ్ వోచర్‌లను పొందవచ్చు. వీటిని మీరు యాప్ ద్వారా గ్యాస్ బిల్లు చెల్లింపులను చేయడం ద్వారా డిస్కౌంట్ ధరలకు మీకు కావాలసిన ప్రొడక్ట్‌లు పొందడానికి వివిధ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఉపయోగించవచ్చు. అయితే ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి కనీస లావాదేవీ మొత్తం రూ.50.

పేటీఎమ్‌లో క్యాష్‌బ్యాక్ పాయింట్‌లు

గ్యాస్ బిల్లు చెల్లింపులపై పేటీఎమ్ కూడా ఆఫర్లు ఇస్తోంది. మీ గ్యాస్ బిల్లు చెల్లింపులను చేయడం ద్వారా మీరు పేటీఎమ్‌లో క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను సంపాదించవచ్చు. వివిధ ఆన్‌లైన్ ఉత్పత్తులపై ఆఫర్‌లపై ప్రత్యేకమైన డీల్‌లను పొందడానికి ఈ క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.

Also Read: Tax Refund Status: ఐటీఆర్ ఫైల్ చేశారా..? రీఫండ్ స్టాటస్‌ను ఇలా చెక్ చేసుకోండి  

Also Read: SBI MCLR Price: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. వడ్డీ రేట్లు పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News