Income Tax Return Deadline Extended: కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీల ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ఒక నెల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీలు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి నవంబర్ 30 వరకు సమయం ఉంది. అంతేకాకుండా తమ ఖాతాలను 'ఆడిట్' చేయాల్సిన కంపెనీలకు, ఆడిట్ నివేదికను సమర్పించడానికి చివరి తేదీని కూడా ఒక నెల పాటు అక్టోబర్ 31 వరకు పొడిగించారు. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఫారమ్ ఐటీఆర్-7లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నోటీఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు సీబీడీటీ ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఫారం 10B/10BB దాఖలు చేయడానికి గడువు తేదీని నవంబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు ట్వీట్‌లో రాసుకొచ్చింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం ఫారమ్ ITR-7లో ఐటీఆర్ సమర్పించడానికి గడువు తేదీ కూడా అక్టోబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. 


అదేవిధంగా రిటర్న్‌లను సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు.. ఇతర సహాయాన్ని అందించడానికి ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.29 శాతం పెరిగి రూ.9.87 లక్షల కోట్లకు చేరాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.8.34 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. 


ఇక ఈ సారి ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు దాఖలు చేసిన ఐటీఆర్‌లు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు జూలై 31 వరకు దాఖలు శారు. ఇందులో 53.67 లక్షల మంది మొదటిసారి దాఖలు చేయడం గమనార్హం. "31 జూలై 2023 వరకు AY 2023-24 కోసం దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌ల సంఖ్య 6.77 కోట్ల కంటే ఎక్కువ. ఇది 31 జూలై 2022 వరకు దాఖలు చేసిన AY 2022-23 (5.83 కోట్లు) మొత్తం ITRల కంటే 16.1 శాతం ఎక్కువ." అని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. 


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook