Income Tax Notice: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.. ఇబ్బందులు పడాల్సిందే..!
How To Check Income Tax Notice Online: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.
How To Check Income Tax Notice Online: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తే.. ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు కూడా వస్తాయి. అందుకే పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో చాలా జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమాచారాన్ని అందించకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వెంటనే నోటీసులు అందుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఐటీఆర్ దరఖాస్తు నింపే సమయంలో తమ ఆదాయ వివరాల గురించి పన్ను చెల్లింపుదారులు పూర్తి సమాచారాన్ని అందించాలి. ఈ 5 ప్రధాన తప్పులలో ఏదైనా ఒకదానిపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.
==> ఐటీఆర్ ఫారమ్‌లో..
ఐటీఆర్ ఫారమ్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు ఎదుర్కొవచ్చు. స్క్రూటినీ సమయంలో తప్పనిసరిగా అన్ని వివరాలు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేసి ఉంటే.. ఆదాయపన్ను శాఖకు సమాచారం అందించాలి. మీ ఆస్తులు, ఆదాయాన్ని సరిగ్గా వెల్లడించాలని పన్ను శాఖ అడుగుతుంది. పొరపాటున ఐటీఆర్‌లో సరైన సమాచారం ఇవ్వకపోతే.. నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది.
==> ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోతే..
ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంటారు. మీ ఆదాయం ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే.. కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు.
==> మీరు రిటర్న్‌లో టీడీఎస్ ఫైల్ చేసినట్లయితే.. ఆ చెల్లింపులో ఏదైనా తేడా ఉంటే మీరు నోటీసులు అందుకుంటారు. ముందుగా ఎంత టీడీఎస్ కట్ అవుతుందో ఎల్లప్పుడు చెక్ చేసుకోండి.
==> మీరు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయాన్ని అదే ఏడాది ఐటీఆర్‌లో చూపించాలి. ఐటీఆర్‌లో ఖాతాలు, ఎఫ్‌డీలు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ గురించి చాలా మంది సమాచారం ఇవ్వరు. మీ బ్యాంక్ నుంచి మీరు పొందే వడ్డీ స్టేట్‌మెంట్‌ను తీసుకుని ఐటీఆర్‌లో ఫైల్ చేయండి.
==> మీ ఖాతాలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినా.. లేదా ఎక్కువ నగదు జమ అయినా మీరు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆదాయం ఏడాదికి రూ.5 లక్షలు అయితే.. ఒక ఏడాదిలో రూ.12 లక్షలను తన ఖాతాలో జమ చేసినట్లయితే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు పంపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి