CM Jagan Mohan Reddy: హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ప్యాకేజీ స్టార్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది: సీఎం జగన్

CM Jagan on Pawan Kalyan: ఐదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ మంగళవారం విడుదల చేశారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే.. గతంలో పాలన చేసిన వాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. పొత్తులు, ఎత్తులు, జిత్తులు నమ్ముకున్నారని విమర్శించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 16, 2023, 12:51 PM IST
CM Jagan Mohan Reddy: హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ప్యాకేజీ స్టార్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది: సీఎం జగన్

CM Jagan on Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెండు సినిమాల మధ్య విరామంలో అప్పుడప్పుడూ పొలిటికల్‌ మీటింగులు పెడతాడని.. బాబు చెప్పే స్క్రిప్టు ప్రకారం.. ప్యాకేజీల స్టార్‌ వచ్చి నాలుగు రాళ్లు మీ బిడ్డమీద వేసి వెళ్లిపోతాడని అన్నారు. ఇలాంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా..? వీళ్లు ప్రజలకు మంచి చేయగలరా..? అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా ఐదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను మంగళవారం ఆయన విడుదల చేశారు. బటన్‌ నొక్కి 231 కోట్ల రూపాయలను 1,23,519 మత్స్యకార కుటుంబాల అకౌంట్లలో జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తన ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి గతంలో పాలన చేసినవాళ్లు.. వారికి మద్దతు ఇస్తున్నవారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పేదవాడికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఏ మంచి చేయని చంద్రబాబు.. ఆయన దత్తపుత్రుడు వీరిద్దరూ పొత్తులను.. ఎత్తులు, జిత్తులు, కుయుక్తులను నమ్ముకున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండికూడా చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం గుర్తుకు రాదన్నారు. కానీ చంద్రబాబు పేరు చెప్తే.. అందరికీ గుర్తుకు వచ్చేది వెన్నుపోటు మాత్రమేనని విమర్శించారు. మోసం గుర్తుకు వస్తుంది.. కుతంత్రాలు గుర్తుకు వస్తాయన్నారు. పేదలకు ఏ మంచీ చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారు..? అని అన్నారు.

'మరో వంక ఆయన దత్తపుత్రుడు ఉన్నాడు.. రెండు సినిమాల మధ్యవిరామంలో అప్పుడప్పుడూ పొలిటికల్‌ మీటింగులు పెడతాడు. బాబు చెప్పే స్క్రిప్టు ప్రకారం, ప్యాకేజీల స్టార్‌ వచ్చి నాలుగు రాళ్లు మీ బిడ్డమీద వేసి వెళ్లిపోతాడు. ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా..? వీళ్లు ప్రజలకు మంచి చేయగలరా..? వీళ్లిద్దరూ ఎలాంటి వాళ్లు అంటే.. అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌. అక్కడే వీరి శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద, మన పేదలమీద గాని, మన ప్రజలమీద వీరికి ఎలాంటి ప్రేమా లేదు. కనీసం ఇక్కడ ఉండాలన్న ఆలోచన కూడా వీరికి తట్టదు. మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు. అక్కడే మీ బిడ్డ నివాసం ఉంటున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో కూడా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ప్యాలెస్‌ కట్టుకుంటాడు. తేడా గమనించమని కోరుతున్నాను.

ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి.. వీరి పార్టీలకు, వీరి సిద్ధాంతాలు ఒక్కటే. మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని హైదరాబాద్‌లో నివాసం ఉండడం. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశానని చంద్రబాబు కోతలు కోస్తాడు. మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు, 175 చోట్ల ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు. కనీసం రాష్టంలోని అన్నిస్థానాల్లో తన పార్టీకి రెండోస్థానం వస్తుందో..? లేదో..? పరువు దక్కించుకోగలుగుతాడనే నమ్మకం లేదు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి 175 నియోజకవర్గాల్లో కనీసం పోటీకి పెట్టే కెపాసిటీ వారికి లేదు. చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌ మీద ఉంది. నలుగురు కలిసి లేపితే తప్ప లేవలేని పరిస్థితిలో ఉంది. రెండు చోట్ల పోటీచేస్తే.. మాకు ఎమ్మెల్యేగా వద్దని రెండు చోట్లా కూడా దత్తపుత్రుడ్ని ప్రజలను ఓడించే పరిస్థితి. 10 ఏళ్లుగా రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. ఒక్కో ఎన్నికకూ.. ఒక్కో రేటు.. పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ఈ ప్యాకేజీ స్టార్‌. నాకు సీఎం పదవి లేకపోయినా పర్వాలేదు. దోపిడీలో నా వాటా నాకు వస్తు చాలంటున్నాడు. వీళ్లంతా ఎందుకు కలుస్తాన్నారో ప్రజలు ఆలోచన చేయాలి.
 
దత్తతండ్రికి.. దత్తపుత్రుడికి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది. మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటే.. చిత్తం ప్రభూ అని దత్తపుత్రుడు దాసోహం అవుతాడు. మనం విడివిడిగా వెళ్తే మంచి జరుగుతుందని చంద్రబాబు చెప్తే.. అలాగే సర్‌.. మీకు ఏది మంచి జరిగితే అలా చేద్దాం.. అంటాడు దత్తపుత్రుడు. నువ్వు పోటీచేయకు అని దత్తపుత్రుడితో అంటే.. జీహుజూర్‌ అంటాడు. కమ్యూనిస్టులతో కలిసి ఉండు.. అంటే.. అలాగే సర్ అంటాడు. మనం విడివిడిగా పోటీచేసినట్టు కనిపిస్తాం.. లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందాం.. నేను గాజువాక రాను, భీమవరం రాను, నువ్వు మంగళగిరిలో పోటీపుట్టకు అని చంద్రబాబు అంటే.. దత్తపుత్రుడు అలాగే సర్‌ అంటాడు. ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వు ఉండూ దత్తపుత్రా అని చంద్రబాబు చెప్తే.. చిత్రం ప్రభూ అంటాడు దత్తపుత్రుడు. మళ్లీ ఇదే బీజేపీకి విడాకులు ఇచ్చేయ్‌ అని చంద్రబాబు అంటే.. మీరు ఎలా చెప్తే.. అలా చేస్తా అంటాడు.. ఇదే దత్తపుత్రుడు. ఇలాంటి రాజకీయాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలు వేయడానికైనా దత్తపుత్రుడు రెడీ..' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. 

Also Read: Dengue Day Theme 2023: ప్రతి సంవత్సరం డెంగ్యూ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

Also Read: Naresh Pavitra Kiss : రెచ్చిపోయిన జంట.. షోలో నరేష్ పవిత్రల ముద్దులు.. బంధం మీద క్లారిటీ వచ్చేసినట్టే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News