IT Returns 2024: 2023-24 ఆర్ఖిక సంవత్సరం ముగిసిపోయింది. ముగిసిన ఆర్దిక సంవత్సరంతో పాటు రానున్న ఆర్ధిక సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ విషయంలో ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిన సమయం వచ్చేసింది. ఉద్యోగుల చేతికి ఫామ్ 16 అందగానే ఐటీ రిటర్న్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ జూలై 31. ఈ నేపధ్యంలో ఫామ్ 16 గురించిన ముఖ్య వివరాలు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఫామ్ 16 సహాయంతో ప్రతి ట్యాక్స్ పేయర్ విధిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 16 అనేది ఉద్యోగులకు కంపెనీ జారీ చేసే పత్రం. ఇందులో ఆ ఉద్యోగి ఆదాయ వివరాలు, పీఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్, టీడీఎస్ వంటి వివరాలు ఆ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిగా ఉంటాయి. గతించిన ఆర్ధిక సంవత్సరం అంటే 2023-24 సంబంధించిన ఆదాయం, ట్యాక్స్, హౌసింగ్ అలవెన్స్, బేసిక్ శాలరీ, టీడీఎస్, పీఎఫ్ వంటి వివరాలు పూర్తిగా ఉంటాయి. మీ జీతం నుంచి మీ కంపెనీ ఇన్‌కంటాక్స్ శాఖకు చెల్లించిన టీడీఎస్, పీఎఫ్ వివరాలకు ఇదే రుజువు. ఫామ్ 16 నుంచి పార్ట్ ఎ, పార్ట్ బి అని రెండు రకాలుంటాయి.


ఫామ్ 16లో ఆ ఉద్యోగి పాన్ నెంబర్, ఎంప్లాయర్ టాన్ నెంబర్, జీతం, సెక్షన్ల కింద వర్తించే మినహాయింపులు, టీడీఎస్ వివరాలుంటాయి. జూన్ 15 లేదా అంతకంటే ముందు ప్రతి కంపెనీ ఉద్యోగికి ఫామ్ 16 జారీ చేస్తుంటుంది. ఫామ్ 16ఎలో ప్రతి మూడు నెలలకు జీతం నుంచి కట్ అయ్యే టీడీఎస్ వివరాలుంటాయి. అదే ఫామ్ 16 బిలో జీతంలోని ఇతర అంశాలు, క్లెయిమ్ చేసుకునే ఆదాయం పన్ను మినహాయింపులుంటాయి. ఇప్పటి వరకూ ఎంత పన్ను చెల్లించారు, ఇంకా ఏమైనా చెల్లించాల్సి ఉందా వంటి వివరాలుంటాయి.


ఫామ్ 16 అందుకున్న తరువాత అందులో అన్ని వివరాలు పూర్తిగా ఉన్నాయో లేవో సరిచూసుకోండి. మీ ఆదాయం, టీడీఎస్ మినహాయింపులు, ఆదాయ గణాంకాలు, పన్ను మినహాయింపులు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఫామ్ 16 అనేది ఆ ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగి సంపాదించిన ఆదాయానికి రుజువులా పనిచేస్తుంది. మీ జీతం నుంచి కట్ అయ్యే టీడీఎస్‌కు కూడా అదే రుజువు. ఫామ్ 16 ఒక్కటుంటే చాలు...ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రక్రియ నిమిషాల్లో పూర్తయిపోతుంది. టీడీఎస్ క్లెయిమ్ కూడా మీకు రావల్సింది ఏదైనా ఉంటే రిటర్న్స్‌తో పాటు చేసుకోవచ్చు. 


Also read: FD vs NSC Benefits: ఎఫ్‌డి , ఎన్‌ఎస్‌సిల్లో 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ఎందులో ఎక్కువ లాభాలొస్తాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook