IT Returns Benefits: జీరో ఐటీఆర్ అంటే ఏమిటి, ఐటీ రిటర్న్స్‌తో కలిగే 4 అద్భుత ప్రయోజనాలు
IT Returns Benefits: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ పనిలో ఉన్నారు. అసలు ఐటీ రిటర్న్స్ అనేది కేవలం ట్యాక్స్ చెల్లింపుదారులకేనా, ఇతరులకు వర్తించదా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Returns Benefits: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి చాలా అంశాలు అందరికీ తెలియవు. ఐటీ రిటర్న్స్ అంటే కేవలం ట్యాక్స్ పేయర్లే ఫైల్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ ట్యాక్స్ చెల్లింపుదారులు కాకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు, దానివల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా అనేది తెలుసుకుందాం.
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అనేవి కేవలం ట్యాక్స్ చెల్లింపుదారులకే కాదు ఇతరులకు కూడా వర్తిస్తుంది. తమ ఆదాయం ట్యాక్స్ పరిధిలో వస్తేనే రిటర్న్స్ పైల్ చేయాలని లేదు. ఇతరులు కూడా చేయవచ్చు. దీనినే జీరో ఐటీఆర్ లేదా నిల్ ఐటీఆర్ అంటారు. అంటే ట్యాక్స్ పరిధిలో లేనివాళ్లు ఫైల్ చేసేది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. ఆ తరువాత ఫైల్ చేయాలంటే జరిమానా ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు చట్టపరంగా విలువ ఉంటుంది. ఐడీ ప్రూఫ్‌గా, ఆదాయం ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. వివిధ రకాల ప్రభుత్వ సంబంధిత పనులకు ఐడీ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మీ ఆదాయం ప్రూఫ్ కోసం కూడా ఇదే ఉపయోగించవచ్చు.
ఏదైనా ఇళ్లు లేదా ఆస్థి కొనుగోలు చేసేటప్పుడు ఆదాయం ప్రూఫ్ కోసం ఐటీ రిటర్న్స్ ఉపయోగపడతాయి. ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసేందుకు కూడా ఐటీ రిటర్న్స్ ఉపయోగపడతాయి. అంటే రిటర్న్స్ పైల్ చేసేటప్పుడే రిఫండ్ కూడా పైల్ చేస్తారు.
అన్నింటికంటే ముఖ్యంగా లోన్ కోసం అంటే కారు లోన్ లేదా హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకు అడిగే కొన్ని తప్పనిసరి డాక్యుమెంట్లలో ఇదొకటి అవుతంది. ఐటీ రిటర్న్స్ ఉంటే బ్యాంకు లోన్ ప్రక్రియ సులభతరమౌతుంది. గత మూడేళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతుంటాయి బ్యాంకులు.
ఇక విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వీసా అప్లై చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ తప్పకుండా ఉండాలి. వీసా అప్రూవల్ రావాలంటే ఐటీ రిటర్న్స్ తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ద్వారా ఎంబసీకు మీ ఆర్ధిక పరిస్థితి కూడా తెలుస్తుంది. తద్వారా వీసా అప్రూవల్ ప్రక్రియ సులభతరమౌతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook