Train Ticket Price concession In Budget: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 23న బడ్డెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ రైల్వే ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా వారికి తీపి కబురు అందించనున్నారు. ఈ వివరాలు తెలుసుకుందాం.
మన దేశంలో రైలు ప్రయాణం నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వారి వయస్సురీత్యా టిక్కెటు ధరలు కూడా ఉంటాయి. అయితే, రైలు ప్రయాణీకులకు వార్త గుడ్ న్యూస్ కానుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు ఓ తీపికబురు బడ్జెట్ రోజు అందనుంది. రైలు టిక్కెట్ ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. 2020 మార్చికు ముందు ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజెన్లకు అందించే డిస్కౌంట్‌ను తొలగించింది. ఆ సమయంలో వృద్ధ మహిళలకు 50 శాతం టిక్కెట్‌పై డిస్కౌంట్ రాగా, మగవారికి 40 శాతం వరకు ఉండేది. ఆ తర్వాత ఈ డిస్కౌంట్ తొలగించడంతో వారికి కూడా టిక్కెట్ ధర పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
ఇండియన్ రైల్వే ప్రకారం ట్రాన్స్‌జెండర్స్, మగవారు 60 ఏళ్లు, 58 ఏళ్లు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజెన్లుగా పరిగణిస్తారు. అయితే, వీరికి ప్రత్యేకంగా మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో టిక్కెట్ ధరలో డిస్కౌంట్ ఇస్తారు. ముఖ్యంగా డురాంటో, శతాబ్ధి, జన్ శతాబ్ధి, రాజధాని ట్రైన్స్‌లలో ప్రత్యేక ధరలు అందుబాటులో ఉండేవి. అయితే ఆర్‌టీఐ ప్రకారం ఈ ప్రత్యేక రాయితీ తొలగింపు వల్ల రైల్వేకు అదనంగా రెవెన్యూ వస్తోంది. ఈ సందర్భంగా ఇండియన్ రైల్వేకు రూ. 5,062 కోట్లు, రూ. 2,242 కోట్ల రెవెన్యూ లభించింది. ఈ సెగ్మెంట్‌లో మగవారు 4.6 కోట్లు, 3.3 లేడీ ప్యాసెంజర్స్, 18,000 ట్రాన్సెజెండర్‌లు ఉంటారు.
Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
అయితే, సీనియర్ సిటిజెన్లకు కల్పించే ఈ రాయితీ మళ్లీ కల్పించాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే, ఇండియన్ రైల్వేకు మళ్లీ భారంగా మారుతుంది. 2019-20 వరకు రూ. 59,837 కోట్లు టిక్కెట్ ధరలో రాయితీ ఇచ్చామని 2023 డిసెంబర్‌లో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి