IT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు. ఇన్‌కంటాక్స్ శాఖ అందిస్తున్న వివరాల ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక వెరిఫై కాకపోతే ఆ ప్రక్రియ పూర్తి కానట్టే. అదే సమయంలో ఏమైనా తప్పులుంటే తిరిగి రివైజ్ కూడా చేసుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పటి వరకూ 13792552 రిటర్న్స్ ఫైల్ కాగా అందులో 12905361 వెరిఫై అయ్యాయి. వీటిలో 3937293 ఐటీ రిటర్న్స్ ప్రోసెస్ కూడా అయ్యాయి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరివారు వ్యక్తిగతంగా ఆన్‌లైన్ విధానంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే ఈ సమస్య తలెత్తుతుంది. బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ తప్పుగా రాయడం, వడ్డీ ఆదాయం ప్రస్తావించకపోవడం, ఇలా చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకవేళ మీరు కూడా తప్పుగా రిటర్న్స్ ఫైల్ చేసుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్లీ రివైజ్ చేయవచ్చు.


ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 139(5) ప్రకారం ఏదైనా తప్పుగా ఫైల్ చేసినట్టు తెలిస్తే వాటిని సరిదిద్దుకోవచ్చు. దీనికోసం ఐటీ‌ఆర్ రివైజ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసుంటే వెంటనే ఐటీ రిటర్న్స్ రివైజ్ ఫైల్ చేయండి. ఐటీ రిటర్న్స్ రివైజ్ అనేది ఎన్ని సార్లు అయినా చేయవచ్చు. మీ ఐటీ రిటర్న్స్ రివైజ్ చేస్తుంటే ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోండి. రిటర్న్స్ పైల్ చేశాక వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి. 


ఐటీ రిటర్న్స్ తప్పులు జరిగితే ఎలా సరిదిద్దాలి


ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు సంబంధించిన పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/. ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇ ఫైల్ క్లిక్ చేసి తరువాత రెక్టిఫికేషన్ లింక్ ప్రెస్ చేయాలి. అందులో ఆర్డర్-ఇంటిమేషన్ టు బి రెక్టిఫైడ్ అనేది ఎంచుకోవాలి. ఇప్పుడు ఏం కావలో ఎంచుకోవాలి. మీరు ఏది సరి చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేయాలి. మీ వివరాలు అప్‌డేట్ చేసి సబ్మిట్ చేయాలి. మీ రిజిస్టర్ మెయిల్ ఐడీకు మెయిల్ వస్తుంది. 


మీరు సరిచేసిన వివరాలు ఐటీ రిటర్న్స్‌లో ఎంటర్ అయ్యాయో లేదే స్టేటస్ చెక్ చేయవచ్చు. దీనికోసం ఇన్‌కంటాక్స్ శాఖ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/.ఓపెన్ చేయాలి. మై ఎక్కౌంట్ మెనూ ఓపెన్ చేసి వ్యూ ఇ ఫైల్డ్ రిటర్న్స్ క్లిక్ చేయాలి. ఇప్పుడు రెక్టిఫికేషన్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే స్టేటస్ మీకు కన్పిస్తుంది. 


Also read: IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook