కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్‌లో వ్యక్తిగత ఇన్‌కంటాక్స్ పేయర్లకు ఉపశమనం కల్గించారు. కొత్త ట్యాక్స్ విధానంలో ఏడాదికి 7 లక్షల ఆదాయం వరకూ ట్యాక్స్ మినహాయింపునిచ్చారు. ఈ క్రమంలో 30 ఏళ్ల క్రితం ఎంత ఆదాయానికి ఎంత ట్యాక్స్ ఉండేదో తెలిపే ఫోటో వైరల్ అవడం చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ విధానంలో తీసుకొచ్చిన మార్పులతో చాలామంది అంటే 50 శాతం మంది కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త ట్యాక్స్ విధానం కంటే పాతదే బాగుందని విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. అదే సమయంలో అసలు 30 ఏళ్ల క్రితం ట్యాక్స్ విధానం ఎలా ఉండేదనేది ఇప్పుడు కొత్తగా చర్చకొస్తోంది. కారణం నాటి ట్యాక్స్ వివరాల ఫోటో వైరల్ అవడమే. 1992లో ట్యాక్స్ స్లాబ్ ఫోటో ఇది. ఆ సమయంలో ఎంత ఆదాయంపై ఎంత ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేదనే వివరాలు ఫోటోలో ఉన్నాయి. 


మూడు విభాగాల్లో ట్యాక్స్ స్లాబ్


1992లో ప్రధానమంత్రి పీవి నరశింహారావు ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ట్యాక్స్ స్లాబ్‌ను 3 రకాలుగా విభజించారు. 1992 ట్యాక్స్ స్లాబ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1992లో కొత్త ట్యాక్స్ స్లాబ్. ఆ సమయంలో 28000 రూపాయలు ఏడాది ఆదాయంపై ఏ విధమైన ట్యాక్స్ లేదు. 28001 రూపాయి నుంచి 50 వేల వరకూ ఆదాయంపై 20 శాతం ట్యాక్స్ ఉండేది. ఇక 50001 రూపాయి నుంచి 1 లక్ష రూపాయల వరకూ వార్షిక ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ ఉండేది. ఆ తరువాత వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే 40 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. ఇప్పటితో పోలిస్తే నాటి ట్యాక్స్ చాలా తక్కువని కొందరు..ఇప్పటి ట్యాక్స్ స్లాబ్ కూడా షేర్ చేయాలని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 


Also read: Investment Tips: కొత్త ఏడాదిలో మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి.. ఆదాయం డబుల్ కావడం పక్కా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook