Income Tax: న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ట్యాక్స్ సేవ్ చేయడం ఎలా, ఈ టిప్స్ పాటించండి
Income Tax: ట్యాక్స్ పేయర్లకు ఇది కీలకమైన సమయం. ఇన్‌కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించకపోతే జీతం నుంచి భారీగా ట్యాక్స్ కట్ అవుతుంటుంది. ఒక్కోసారి ట్యాక్స్ ప్రూఫ్స్ సమర్పించినా పరిమితి సరిపోకుంటే ట్యాక్స్ కట్ అవుతుంది. అందుకే ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించిన ఈ టిప్స్ తప్పకుండా తెలుసుకోవాలి.
Income Tax: ప్రస్తుతం రెండు ట్యాక్స్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, న్యూ ట్యాక్స్ రెజీమ్. ఒకవేళ పొరపాటున న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుని ట్యాక్స్ కట్ అవుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని టిప్స్ పాటిస్తే కొత్త ట్యాక్స్ విధానంలో కూడా ట్యాక్స్ ఆదా చేయవచ్చు. మినహాయింపు పొందవచ్చు. న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ట్యాక్స్ డిడక్షన్ మినహాయింపు ఎలా పొందాలో తెలుసుకుందాం.
న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ఇంతకుముందు స్డాండర్డ్ డిడక్షన్ ఉండేది కాదు. 2023 బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేలు మినహాయింపు పొందవచ్చు. ట్యాక్స్ పేయర్ ఏ ట్యాక్స్ విధానం ఎంచుకున్నా స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం వర్తిస్తుంది. న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ఉద్యోగస్థులు అన్ని రకాల ట్రావెల్ అలవెన్సులు, రవాణా ఖర్చులు, కన్వీనియెన్స్ వంటివాటిపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అంతేకాకుండా 50 వేల వరకూ బహుమతులపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. హోమ్ లోన్‌పై కూడా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. వాలంటరీ రిటైర్మెంట్ పధకంలో కూడా గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై మినహాయింపు లభిస్తుంది. న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో 3 లక్షల వరకూ జీతంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 3-6 లక్షల జీతంపై 5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే 6-9 లక్షల జీతంపై 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి. 9-12 లక్షల జీతంపై 15 శాతం ట్యాక్స్ చెల్లించాలి. 12-15 లక్షల వేతన జీవులైతే 20 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే 15 లక్షల జీతం దాటితే మాత్రం 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
Also read: SBI Big Alert: ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న డెబిట్ కార్డుల ఛార్జీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook