Post Office Franchise: పోస్టాఫీసు ఫ్రాంచైజీ వ్యాపారంలో మంచి లాభాలు, ఇవాళే ప్రారంభించండి
Post Office Franchise: ఇక నుంచి మీరే కొత్తగా పోస్టాఫీసు నడపొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ..నిజమే. పోస్టాఫీసు ఆ అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఏం చేయాలి, ఎంత లాభమొస్తుందనే వివరాలు మీ కోసం..
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉందా..ఫ్రాంచైజీ వ్యాపారాలు కూడా మంచివే. తక్కువ పెట్టుబడితో చేసే సరికొత్త వ్యాపారం ఒకటుంది. పోస్టాఫీసు ఆ అవకాశాన్ని మీకు కల్పిస్తోంది. ఆ అవకాశం అందుకుంటే మీరే సొంతంగా పోస్టాఫీసు వ్యాపారం చేయవచ్చు. అదేంటని ఆలోచిస్తున్నారా..
పోస్టాఫీసు ఇప్పుడు ఫ్రాంచైజీ ఇస్తోంది. దీనికోసం మీరు కేవలం 5000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టాఫీసు ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎంత సంపాదన ఉంటుంది. ఎవరికి అర్హత ఉందనే వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా 1 లక్షా 55 వేల పోస్టాఫీసులున్నాయి. అయినా పోస్టాఫీసులకు డిమాండ్ ఉంది. దీనికి కారణం ఇటీవలి కాలంలో పోస్టాఫీసుకు సంబంధించిన పనులు అధికమౌతున్నాయి. పోస్టాఫీసు పనులకు సంబంధించిన ఫ్రాంచైజీతో మంచి సంపాదన ఆర్జించవచ్చు.
ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు పెద్దగా చదువుకోకపోయినా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా పోస్టాఫీసు ఫ్రాంచైజీ తెరవవచ్చు. మంచి సంపాదన ఆర్జించవచ్చు. ఇండియా పోస్ట్ కొద్దిరోజుల క్రితం ఫ్రాంచైజీ మోడల్ ప్రారంభించింది. సామాన్య ప్రజలు కూడా పోస్టాఫీసు అవుట్‌లెట్స్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో ఇండివిడ్యువల్, ఇనిస్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. నగర టౌన్‌షిప్, స్పెషల్ ఎకానమిక్ జోన్, ఇనిస్టిట్యూషనల్ సెంటర్, కాలేజ్, పోలీటెక్నిక్స్, యూనివర్శిటీల్లో కూడా ఫ్రాంచైజీ పనులు చేపట్టవచ్చు.
దీనికోసం కావల్సిన కనీస వయస్సు 18 ఏళ్లు. ఎంపికైనవారితో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టాఫీసు ఎంవోయూ చేసుకుంటుంది. 8వ తరగతి కనీస విద్యార్ఙతగా ఉంది. స్టాంప్ అండ్ స్టేషనరీ, రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్ బుకింగ్ వంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది. మనీ ఆర్డర్ కనీస బుకింగ్ 100 రూపాయలు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ పనులు కూడా ఉంటాయి. పోస్టాఫీసు ఫ్రాంచైజీ కోసం ఎంపిక ప్రక్రియ డివిజనల్ హెడ్ చేస్తారు.
ఫ్రాంచైజీ సంపాదన పోస్టాఫీసు సర్వీసులపై లభించే కమీషన్ ఆధారంగా ఉంటుంది. ఈ కమీషన్ ఎంతనేది ఎంవోయూలో నిర్ధారితమౌతుంది. రిజిస్టర్డ్ ఆర్టికల్ బుకింగ్ 3 రూపాయలు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ బుకింగ్‌పై 5 రూపాయలు, 100 నుంచి 200 మనీ ఆర్డర్ బుకింగ్‌పై 3.50 రూపాలు, 200 కంటే ఎక్కువ మనీ ఆర్డర్‌పై 5 రూపాయలు కమీషన్ ఉంటుంది. ప్రతినెలా రిజిస్టర్, స్పీడ్ పోస్ట్ 1000 కంటే ఎక్కువైతే 20 శాతం అదనంగా కమీషన్ ఉంటుంది. పోస్ట్ స్టాంప్, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ బుకింగ్‌పై మొత్తం అమ్మకాల్లో 5 శాతం ఉంటుంది. రెవెన్యూ స్టాంప్, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీజు స్టాంప్ వంటివాటిపై 40 శాతం ఉంటుంది.
దీనికోసం 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అది కాకుండా 1-2 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరమౌతుంది. ఇందులో ఇండియాపోస్ట్ ఉత్పత్తులు కొనుగోలు కూడా ఉంటుంది. నెలకు కనీసం 50 వేల రూపాయల బిజినెస్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook