Top 6 Cars: 10 లక్షల కంటే తక్కువకు లభించే బెస్ట్ సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లు ఇవే
Top 6 Cars: కారు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి ఆప్షన్. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా బడ్జెట్‌పరంగా కూడా తక్కువ ధర. 10 లక్షల కంటే తక్కువకే అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Top 6 Cars: ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్లలో చాలా రకాల సేఫ్టీ ఫీచర్లు ఉంటున్నాయి. ఈ కార్ల ధర కూడా తక్కువ కావడంతో చాలామంది కస్టమర్లు వీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. 10 లక్షల కంటే తక్కువకే ఈ కార్లు మీ సొంతం చేసుకోవచ్చు.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఇటీవల కస్టమర్లు కూడా సేఫ్టీ ఫీచర్లు ఎక్కువగా ఉన్న కార్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హై స్ట్రెంగ్త్ స్టీల్, ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సేఫ్టీ బెల్ట్ అలర్ట్ సిస్టమ్, రేర్ సీట్ బెల్ట్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటివి అవసరం. ఈ సేఫ్టీ ఫీచర్ల కారణంగానే కార్ల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే బడ్జెట్ పరంగా 10 లక్షల్లోపు సేఫ్టీ ఫీచర్లతో లభించే కార్లు ఏమున్నాయో తెలుసుకుందాం.
Hyundai grand i10 Neos: ఈ కారు ధర 5.92 లక్షల్నించి ప్రారంభమౌతుంది. అత్యధికంగా 8.23 లక్షల వరకూ ఉంటుంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఇందులో కావల్సిన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
Hyundai Exter: ఈ కారు ధర 6.12 లక్షల నుంచి ప్రారంభమై 9.16 లక్షల వరకూ ఉంటుంది.
Hyundai Aura: ఈ కారు ధర 6.48 లక్షల్నించి ప్రారంభమై 9 లక్షల వరకూ ఉంటుంది.
Hyundai i20: ఈ కారు ధర 7 లక్షల నుంచి ప్రారంభమై 11.20 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో అత్యధికంగా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
Hyundai Venue: ఈ కారు ధర 7 లక్షల్నించి ప్రారంభమై 11.20 లక్షల వరకూ ఉంటుంది. ఇదొక ఎస్‌యూవీ మోడల్ కారు.
Tata Nexon: ఈ కారు ధర 8 లక్షల నుంచి ప్రారంభమై 6.95 లక్షల వరకూ ఉంటుంది. ఇది కూడా ఎస్‌యూవీ. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లలో ఒకటి. ఈ కార్లు అన్నింటిలోనూ కనీసం 6 ఎయిర్ బ్యాగ్ తప్పకుండా ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే సేఫ్టీ పరంగా చాలా ఎక్కువేనని చెప్పాలి. ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రమైన గాయాలు కాకుండా తప్పించుకోవచ్చు.
Also read: Sankranti 2024 Wishes: అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మీ బంధుమిత్రులకు ఇలా విష్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook