Indian Currency Notes: మన దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించేది ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). రూపాయి కరెన్సీ నోటు మినహా మిగతా కరెన్సీ నోట్లన్నింటినీ ఆర్‌బీఐ ముద్రిస్తుంది. ఒక్క రూపాయి నోటును మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. రూపాయి నోటుపై కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సంతకం ఉంటుంది. మిగతా కరెన్సీ నోట్లన్నింటిపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటు మినహా మిగతా  కరెన్సీ నోట్లన్నింటిపై 'ఈ నోటు కలిగిన వ్యక్తికి నేను 100/200/500/200 చెల్లిస్తానని హామీ ఇస్తున్నాను' ముద్రించి ఉంటుంది. ఇంతకీ ఇది ఎందుకు ముద్రిస్తారో మీకు తెలుసా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ఎందుకు ముద్రిస్తారంటే :


రూ.100/రూ.200/రూ.500/రూ.2000 ఇలా ఏ నోటు కలిగిన వ్యక్తికైనా.. ఆ నోటుకు సమాన విలువను అందించే బాధ్యత, గ్యారెంటీ ఆర్‌బీఐ తీసుకుంటుంది. ఆ నోటుపై ముద్రించిన విలువకు సమానమైన వస్తువులు లేదా బంగారానికి ఆర్‌బీఐ గ్యారెంటీ ఇస్తుంది. తద్వారా ఈ నోటు వినియోగం పట్ల ఎలాంటి సందేహాలకు తావుండదు. ప్రజల్లో కరెన్సీ వినియోగం పట్ల నమ్మకం ఏర్పరిచేందుకు ఆర్‌బీఐ ఆ వాక్యాన్ని ముద్రిస్తుంది.


ఆర్‌బీఐ చరిత్ర :


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం ఏప్రిల్ 1, 1935న దేశంలో ఆర్‌బీఐ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీ, నిర్వహణ వ్యవహారాలన్నీ ఆర్‌బీఐ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆర్‌బీఐ యాక్ట్ 1934, సెక్షన్ 22 ప్రకారం కరెన్సీ నోట్లను జారీ చేసే హక్కు ఆర్‌బీఐకి ఉంటుంది. 1935 కన్నా ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నోట్ల ముద్రణ, పంపిణీ, నిర్వహణ జరిగేది. 


Also Read: ITBP SI Recruitment 2022: ఇంటర్ విద్యార్హత, రూ.1 లక్ష వేతనం.. ఐటీబీపీలో ఎస్సై ర్యాంక్ ఉద్యోగాలు.. 


Also Read: టాలీవుడ్లో విషాదం.. మొదటి సినిమా రిలీజవ్వకుండానే మ్యూజిక్ డైరెక్టర్ మృతి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook