ITBP SI Recruitment 2022: ఇంటర్ విద్యార్హత, రూ.1 లక్ష వేతనం.. ఐటీబీపీలో ఎస్సై ర్యాంక్ ఉద్యోగాలు..

ITBP SI Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నుంచి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 18 స్టాఫ్ నర్సు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 18, 2022, 10:36 AM IST
  • ఐటీబీపీలో ఎస్ఐ (స్టాఫ్ నర్సు) పోస్టుల రిక్రూట్‌మెంట్
  • మొత్తం 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • విద్యార్హత, అప్లికేషన్ విధానం, తదితర వివరాలన్నీ ఇక్కడ తెలుసుకోండి
ITBP SI Recruitment 2022: ఇంటర్ విద్యార్హత, రూ.1 లక్ష వేతనం.. ఐటీబీపీలో ఎస్సై ర్యాంక్ ఉద్యోగాలు..

ITBP SI Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నుంచి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 18 స్టాఫ్ నర్సు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ కలిగిన ఈ పోస్టులకు నిన్నటి (ఆగస్టు 17) నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఎంపిక చేస్తారు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అభ్యర్థుల విద్యార్హత, వయో పరిమితి :

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత తప్పనిసరి. అలాగే, స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుని జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్తుల వయసు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు సెప్టెంబర్ 16, 1992 కన్నా ముందు సెప్టెంబర్ 16, 2001తర్వాత జన్మించి ఉండకూడదు.

ముఖ్య తేదీలు : 

దరఖాస్తుల స్వీకరణ : ఆగస్టు 17 నుంచి
దరఖాస్తులకు చివరి గడువు : సెప్టెంబర్ 17, 2022 వరకు

ఏయే కేటగిరీకి ఎన్నిపోస్టులు :

జనరల్ 11
ఎస్సీ 01
ఎస్టీ 02
ఓబీసీ 02
ఈడబ్ల్యూఎస్ 02
మొత్తం 18 

స్టాఫ్ నర్సు ఉద్యోగుల వేతనం :

పేస్కేల్- రూ.35,400-రూ.1,12,400 (పే లెవల్ 6)

అప్లికేషన్ ఫీజు :

మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. జనరల్,  అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.  

దరఖాస్తు ప్రక్రియ :

అభ్యర్థులు recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్‌ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. డెడ్ లైన్ ముగిశాక దరఖాస్తులకు అవకాశం ఉండదు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇలా :

శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ), శారీరక ధృఢత్వ పరీక్ష (పీఎస్‌టీ), రాత పరీక్ష, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (ఆర్ఎంఈ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read:Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి.. ఎవరీ పాపన్న ? ఎలా రాజయ్యాడు

Also Read: Kabul Blast: ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు.. రక్తసిక్తమైన మసీదు.. 20 మంది మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News