KVP Scheme: రిస్క్ లేకుండా పదేళ్లలోపే రెట్టింపు లాభం పొందే అద్భుతమైన పధకం ఇదే
KVP Scheme: జీవితంలో కష్టపడి సంపాదించే డబ్బుల్ని రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ లభించే పధకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తీవ్రంగా నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాలు అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
KVP Scheme: పదేళ్ల లోపు కాల వ్యవధికి మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం పొందే అద్భుతమైన పథకాలున్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచేవి కావడంతో ఎలాంటి రిస్క్ ఉండదు. ఇండియన్ పోస్టాఫీసుల ఆఫర్ చేస్తున్న కిసాన్ వికాస్ పత్ర ఇందులో అత్యంత కీలకమైంది. అద్భుతమైన లాభాల్ని ఇస్తుంది.
రిస్క్ లేని దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఆలోచిస్తుంటే ఇదే బెస్ట్ ప్లాన్ కావచ్చు. కిసాన్ వికాస్ పత్ర పధకంపై ఏకంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. పెట్టిన పెట్టుబడికి కేవలం 9 ఏళ్ల 7 నెలల్లో రెట్టింపు పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర ప్రస్తుతం వార్షికంగా 7.5 శాతం కాంపౌండ్ వడ్డీ ఇస్తోంది. దాదాపుగా 115 నెలల్లో పెట్టిన పెట్టుబడిని ఇది రెట్టింపు చేస్తుంది. అంటే పదేళ్లలోపే మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. అంటే కిసాన్ వికాస్ పత్రలో మీరు 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి 1 లక్ష రూపాయలవుతుంది. మీరు పెట్టుబడిని సురక్షిత మార్గంలో పెట్టి అద్భుతమైన రిటర్న్స్ సాధించాలంటే ఇదే బెస్ట్ ప్లాన్ అంటున్నారు.
కేవీపీ ఎక్కౌంట్ అంటే కిసాన్ వికాస్ పత్ర ఎక్కౌంట్‌ను సింగిల్ లేదా జాయింట్ లేదా ముగ్గురు కలిసి ఓపెన్ చేయవచ్చు. మైనర్ అయితే మాత్రం గార్డియన్ తోడుండాల్సి ఉంటుంది. 10 ఏళ్ళు దాటిన మైనర్లు కేవీపీ ఎక్కౌంట్ తమ పేరుమీదనే ఓపెన్ చేసుకోవచ్చు.
కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడికి గరిష్ట పరిమితి ఏదీ లేదు. ఎంతవరకైనా పెట్టుబడి పెట్టవచ్చు. కనీస మొత్తం మాత్రం 1000 రూపాయలతో ప్రారంభమౌతుంది. అంటే సామాన్యులు సైతం ఇందులో తమకు నచ్చినంత పెట్టుబడి పెట్టవచ్చు. ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల కేవీపీ ఎక్కౌంట్ మెచ్యూరిటీకు ముందే క్లోజ్ చేసుకునే అవకాశముంది. అంటే సింగిల్ ఎక్కౌంట్ హోల్డర్ మరణం లేదా ఎక్కౌంట్ హోల్డర్ల మరణం సంభవిస్తే డిపాజిట్ తేదీ నుంచి రెండున్నరేళ్ల తరువాత గెజిట్ ఆఫీసర్ ధృవీకరణతో ఎక్కొంట్ క్లోజ్ చేసుకోవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర లేదా కేవీపీ మాత్రం ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి పరిధిలోకి రాదు. అంటే కేవీపీ పెట్టుబడిపై వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ఉంటుంది.
Also read: Income tax Exemption: ఉద్యోగులకు శుభవార్త, ట్యాక్స్ మినహాయింపు 10 లక్షలు పెంచే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook