Income tax Exemption: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ ఏడాది బడ్జెట్ చివరిది. ఆ తరువాత ఎన్నికలున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్నది కావడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాలకు రిలీఫ్ కలగవచ్చు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చివరి బడ్జెట్. ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఎన్నికలు కావడంతో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాల కోసం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే 2019 మధ్యంతర బడ్జెట్ ద్వారా 5 లక్షల వరకూ సేవింగ్స్‌పై పన్ను మినహాయింపు ఇచ్చారు.
అప్పట్లో ఏడాదికి 5 లక్షల వరకూ ఆదాయం ఉండేవారికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. అన్ని డిడక్షన్లు, మినహాయింపులు తీసుకోగా వార్ఖిక ఆదాయం 6.5 లక్షలున్నా సరే ట్యాక్స్ జీరో ఉంటుందని తెలిపారు. అదే విధంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. ఈ రెండు కీలక ప్రకటనల ద్వారా ట్యాక్స్ పేయర్లు అప్పట్లో చాలా లబ్ది కలిగింది. ప్రస్తుతం ఏడాదికి 7 లక్షల వరకూ ఆదాయముండేవాళ్లు ట్యాక్స్ మినహాయింపు పొందుతున్నారు. ఈసారి ట్యాక్స్ పరిమితిని పెంచుతారని అంచనా ఉంది. ఈసారి బడ్జెట్‌లో ఆదాయం పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం నెలకొన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటే చాలావరకూ సామాన్యులకు పొదుపు అవుతుంది.
సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లలో ప్రభుత్వం ఎప్పుడూ కీలక ప్రకటనలు చేయదు. కానీ 2019 బడ్జెట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ట్యాక్స్ పేయర్లకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అప్పట్లో లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని లబ్ది పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కూడా 2024 ఎన్నికలున్నందున కేంద్ర ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీ 2024న ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై నెలలో ఉండవచ్చు. ఎన్నికల బడ్జెట్ కావడంతో కచ్చితంగా ఆదాయ వర్గాలకు లబ్ది చేకూర్చే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
Also read: New Year 2024: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ ప్లాన్ చేసుకోండి.. టాప్-10 లోకేషన్స్ ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Income tax Exemption: ఉద్యోగులకు శుభవార్త, ట్యాక్స్ మినహాయింపు 10 లక్షలు చేసే అవకాశం