Indian Railway Rules: రైలులో ఒకరి టిక్కెట్‌పై మరో వ్యక్తి ప్రయాణించవచ్చా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
Indian Railway Rules In Telugu: రైళ్లలో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు.. లాస్ట్ మినిట్‌లో తాము వెళ్లలేక ఆ టికెట్లపై ఇతరులను పంపిస్తుంటారు. కానీ రైల్వే నిబంధనల ప్రకారం ఇది చాలా తప్పు. జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
Indian Railway Rules In Telugu: మన దేశంలో రైళ్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పండగల సమయంలో రైళ్లలో రద్దీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేసినా.. అవి ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవు. ఇక దూర ప్రయాణాలకు వెళ్లే వారు చాలా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు. కొంతమంది లాస్ట్ మినిట్‌లో తమ పేరు మీద టికెట్ బుక్ చేసుకుని.. వేరొకరిని ప్రయాణానికి పంపిస్తుంటారు. ఇది రైల్వే నిబంధనలకు విరుద్దం కాగా.. టీసీకి పట్టుబడితే చట్టపరంగా శిక్ష కూడా అర్హులవుతారు.
రైల్వేల టిక్కెట్లు, బోర్డింగ్‌కు సంబంధించిన నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తోంది రైల్వే శాఖ. ట్రైన్‌లో ఎవరి పేరు మీద బుక్ చేసిన టికెట్‌పై వాళ్లే ప్రయాణించాల్సి ఉంటుంది.
ఒక ప్రయాణికుడి టికెట్‌పై మరోకరు ప్రయాణించడానికి వీళ్లేదు. టీసీకి పట్టుబడితే.. టిక్కెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు. భారీ జరిమానాలు విధించవచ్చు. లేదా రైల్వే చట్టం 1989 ప్రకారం.. జరిమానాతో జైలు శిక్ష కూడా విధించవచ్చు. ప్రయాణ తరగతి, దూరం, నేరం ఫ్రీక్వెన్సీని బట్టి ఫైన్ విధించే అవకాశం ఉంటుంది.
మీకు అవసరం ఉండి.. మీరు బుక్ చేసుకున్న టికెట్‌పై వేరే వాళ్ల పంపిస్తే.. ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మీ జర్నీ ప్లాన్‌లో ఏదైనా మార్పు లేదా ఎమర్జెన్సీ ప్రయాణం ఉన్నా.. మీ పేరుపై ఉన్న టికెట్‌ను ఇతరులకు ఇవ్వవద్దు. మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి. లేదంటే రీషెడ్యూల్ కోసం రైల్వే అధికారులను సంప్రదించండి. ఇలా చేస్తే తప్పుడు ప్రవర్తన కింద గుర్తించి.. రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. అ
నధికారిక టికెట్‌తో ప్రయాణించే వ్యక్తులను గుర్తించడం టికెట్ చెకింగ్ స్టాఫ్ (టీటీఈ) బాధ్యత. రైలు ప్రయాణ సమయంలో ప్రతి వ్యక్తి వద్దా టికెట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇతరుల పేర్లతో ప్రయాణించే వ్యక్తులను టీటీఈ గుర్తిస్తే.. తగిన చర్యలు తీసుకుంటారు. జరిమానాతోపాటు ఛార్జీ డబ్బులు కూడా వసూలు చేస్తారు. ట్రైన్ తరువాత చేరుకునే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసి తదుపరి చర్యలకు సిఫార్సు చేయవచ్చు.
Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!
Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి