Online General Tickets: అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సినప్పుడు లేదా షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలకు అందరూ జనరల్ టికెట్లపైనే ఆధారపడుతుంటారు. అయితే సీజన్ సమయంలో పెద్దఎత్తున క్యూ ఉంటుంది. జనరల్ టికెట్ కోసం క్యూలైన్లలో నిలుచోవల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రైల్వే శాఖ ఈ కష్టాల్ని దూరం చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వే ప్రయాణీకులకు అతి ముఖ్యమైన గమనిక ఇది. రైల్వేలో జనరల్ టికెట్ల కోసం ఇకపై బారులు తీరాల్సిన అవసరం ఉండదు. రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ నుంచి తప్పించుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే జనరల్ టికెట్లు కూడా తీసుకోవచ్చు. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన యూటీఎస్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ యాప్ ప్రవేశపెట్టి ఏడాది దాటినా పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ యాప్ గురించి అవగాహన కల్పిస్తోంది. యూటీఎస్ అంటే అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్. ఇటీవల యూటీఎస్ యాప్ వినియోగం పెరుగుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి యూటీఎస్ ద్వారా 14.8 శాతం జనరల్ టికెట్ల విక్రయం జరిగినట్టు రైల్వే శాఖ చెబుతోంది. జనరల్ టికెట్లతో పాటు ప్లాట్ ఫారమ్ టికెట్లు, సీజన్ టికెట్లను ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 


ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ప్లే స్టోర్ నుంచి యూటీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత మీ ఎక్కౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం మీ పేరు, ఫోన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ఎక్కౌంట్ ప్రారంభమౌతుంది. ఆ తరువాత యాప్ ఎప్పుడు లాగిన్ కావాలన్నా ఫోన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేయాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు యాప్‌లో టికెట్ కేటగరీలు కన్పిస్తాయి. ఇందులో నార్మల్ బుకింగ్ ఆప్షన్‌లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్‌ఫామ్ టికెట్ల ఆప్షన్లు కన్పిస్తాయి. కావల్సిన కేటగరీ ఎంచుకోవాలి. 


జనరల్ కేటగరీ ఎంచుకున్న తరువాత ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం, ఎంతమంది ప్రయాణీకులు, చిన్నారులు, పెద్దలెంతమందనే వివరాలు నమోదు చేయాలి. ఆ తరువాత క్యాష్ పేమెంట్ ఆప్షన్ కన్పిస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లలో ఏదో ఒకటి వినియోగించవచ్చు. పేమెంట్ పూర్తయితే టికెట్ కొనుగోలు పూర్తయినట్టే. ఏ రోజు ప్రయాణముంటే ఆరోజే టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముందురోజు తీసుకుంటే ఆ టికెట్ చెల్లదు. ఆన్‌లైన్ జనరల్ టికెట్ల బుకింగ్ వల్ల , యూటీఎస్ యాప్ వల్ల రైల్వే కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించవచ్చు. 


Also read: Mileage Cars: పెట్రోల్ వెర్షన్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 3 కార్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook