Indian Railways: ప్రయాణీకులకు రైల్వే శాఖ షాక్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ మరింత ప్రియం
Indian Railways: రైల్వే సేవల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు అందించే సేవల్లో మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరింత ప్రియం కానున్నాయి.
Indian Railways: రైల్వే సేవల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు అందించే సేవల్లో మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరింత ప్రియం కానున్నాయి.
భారతీయ రైల్వే సామాన్య ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. రైల్వే సేవల విషయంలో కీలకమార్పులు చేసింది. ప్రీమియం రైళ్లలో విధించే సర్వీస్ ఛార్జిల్ని తొలగించింది. అదే సమయంలో బ్రేక్‌ఫాస్ట్ , లంచ్ ధరల్ని పెంచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రీమియం రైళ్లలో వాటర్, టీ పై విధించే సర్వీస్ ఛార్జ్ తీసేసింది. కానీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కోసం అదనంగా 50 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. రైల్వే శాఖ దీనికి సంబంధించిన వివరాల్ని ఐఆర్సీటీసీకు పంపించింది. రాజధాని, దురంతో, శతాబ్ది, వందే భారత్ రైళ్లలో ఇకపై టికెట్ బుకింగ్ సమయంలో భోజనం ఆప్షన్ ఇవ్వకపోతే..సర్విస్ ఛార్జ్ వసూలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
రైల్వే జారీ చేసిన సర్య్కులర్ ప్రకారం రాజధాని శతాబ్ది, దురంతో రైళ్లలోని సెకండ్, థర్డ్ ఏసీలో మార్నింగ్ టీ 20 రూపాయలు కాగా...ఫస్ట్ ఏసీలో 35 రూపాయలుంది. సెకండ్, థర్డ్ ఏసీలో బ్రేక్‌ఫాస్ట్ 105 రూపాయలైతే..ఏసీ ఛైర్‌కార్‌లో 155 రూపాయలుంది. ఫస్ట్ ఏసీలో డిన్నర్, లంచ్ 245 రూపాయలుండగా..సెకండ్, థర్డ్ ఏసీలో 185 రూపాయలు మాత్రమే. అదే ఛైర్‌కార్‌లో 235 రూపాయలుంటుంది. ఫస్ట్ ఏసీలో సాయంత్రం స్నాక్స్ విత్ టీ 140 నుంచి 180 రూపాయలుంది. అదే సెకండ్, థర్డ్ ఏసీల్లో 90 రూపాయలుంది. చైర్‌కార్‌లో అయితే 140 రూపాయలుంది.
దురంతో స్లీపర్ క్లాస్‌లో ఉదయం టీ 15 రూపాయలు, బ్రేక్‌ఫాస్ట్ 90 రూపాయలుంది. ఛైర్‌కార్‌లో 115 రూపాయలుండగా..లంచ్, డిన్నర్ 120 రూపాయలుంది. ఛైర్‌కార్‌లో మాత్రం 170 రూపాయలుంది. అటు ఈవెనింగ్ స్నాక్స్ విత్ టీ కోసం 50 రూపాయలు చెల్లించాలి.
ఇక తేజస్ రైళ్లలో ఫస్ట్ ఏసీలో బ్రేక్‌ఫాస్ట్ 155-200 రూపాయలుంది. అటు లంచ్-డిన్నర్ కోసం 244 నుంచి 294 రూపాయలు చెల్లించాలి. అటు సెకండ్, థర్డ్ ఏసీలో బ్రేక్‌ఫాస్ట్ 122-172 రూపాయలుంటే..లంచ్-డిన్నర్ కోసం 222 నుంచి 272 రూపాయలు చెల్లించాలి. సాయంత్రం స్నాక్స్ విత్ టీ ఫస్ట్ ఏసీలో 105 నుంచి 155 రూపాయలు కాగా..సెకండ్, థర్డ్ ఏసీలో 66 నుంచి 116 రూపాయలుంది. ఇక వందే భారత్ రైళ్లలో టీ 15 రూపాయలు కాగా బ్రేక్‌ఫాస్ట్ 155 నుంచి 205 రూపాయలుంది. సెకండ్, థర్డ్ ఏసీలో 122 నుంచి 172 రూపాయలుంది. లంచ్-డిన్నర్ కోసం 244 నుంచి 294 రూపాయలు చెల్లించాలి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook