మీరు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ గమ్యస్థానం ఏ అర్ధరాత్రో ఉంటే కష్టమే కదా..నిద్ర మెళకువ రాకపోతే గమ్యస్థానం దాటెళ్లిపోయే ప్రమాదముంది. అందుకే రైల్వే ఇప్పుడు కొత్త సేవలు ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పగటి పూట ఫరవాలేదు గానీ..రాత్రి వేళ మీరు దిగాల్సిన గమ్యస్థానం ఉంటే కష్టమే. మీకు నిద్ర మెళకువ రాకపోతే మీరు దిగాల్సిన స్టేషన్ దాటిపోతుంది. లేదా ఆ కంగారులో ఏదో ఒక లగేజ్ మర్చిపోతారు. ఏదేమైనా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రైల్వేశాఖ ఇప్పుడు ప్రయాణీకుల కష్టాలు తొలగించేందుకు కొత్త సౌకర్యం ప్రారంభించింది. రైల్వే రాత్రి ప్రయాణం చేసేవారికి ఈ సౌకర్యం అద్భుతంగా ఉపయోగపడుతుంది.


రైల్వే ప్రయాణీకుల సౌకర్యాలు


ఇండియన్ రైల్వేస్ యాత్రికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. కొత్త కొత్త సౌకర్యాలు అందిస్తోంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ వైఫై, ఎక్స్‌లేటర్ సహా వివిధ సౌకర్యాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుుడు రాత్రివేళ ప్రయాణించేవారికి..అద్భుతమైన సౌకర్యం అందిస్తోంది. ఇక నుంచి రైళ్లో హాయిగా నిద్రపోవచ్చు. మీరు దిగాల్సిన స్టేషన్ దాటిపోతుందనే ఆందోళన అవసరం లేదు.


గమ్యస్థానానికి 20 నిమిషాల ముందు అలర్ట్


రైల్వే ప్రారంభించిన ఈ కొత్త సౌకర్యంలో మీ గమ్యస్థానానికి 20 నిమిషాల ముందు ఎలర్ట్ ఎలార్మ్ మోగుతుంది. ఈ సౌకర్యం పేరు డెస్టినేషన్ ఎలర్ట్ వేకప్ అలార్మ్. చాలామంది రాత్రివేళ నిద్రలో గమ్యస్థానం దాటెళ్లిపోయే ఘటనలు జరుగుతుంటాయి. 


ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు రైల్వే డెస్టినేషన్ ఎలర్ట్ వేకప్ ఎలార్మ్ సౌకర్యం ప్రారంభించింది. ఈ సౌకర్యాన్ని 139 ఎంక్వైరీలో చేర్చారు. దీని ప్రకారం ప్రయాణీకుడు 139కు డయల్ చేసి..ఎంక్వైరీలో అలర్ట్ సౌకర్యం కోరాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కేవలం రాత్రి 11 గంటల్నించి ఉదయం 7 గంటల  వరకే అందుబాటులో ఉంటుంది. ఫలితంగా మీరు మీ గమ్యస్థానాన్ని చేరడానికి 20 నిమిషాల ముందే మెళకువ వస్తుంది. దీనికోసం 3 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం పొందేవారి ఫోన్‌కు 20 నిమిషాల ముందు ఎలర్ట్ వస్తుంది. 


ఈ సౌకర్యం ఎలా పొందాలి


డెస్టినేషన్ ఎలర్ట్ వేకప్ ఎలార్మ్ కోసం మీరు ఐఆర్సీటీసీ హెల్ప్‌లైన్ నెంబర్ 139 డయల్ చేయాలి. లాంగ్వేజ్ ఆప్షన్ ఎంచుకున్న తరువాత..మీరు డెస్టినేషన్ అలర్ట్ కోసం ముందు 7 నంబర్, తరువాత 2 నెంబర్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత మీ పది అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. నిర్ధారించేందుకు 1 నొక్కాలి. అంతే మీ రిక్వస్ట్ పూర్తవుతుంది. 20 నిమిషాలముందు వేకప్ ఎలర్ట్ వస్తుంది. 


Also read: PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధిలో కీలక మార్పులు, 13వ వాయిదా నిలిచే ప్రమాదముంది జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook